రవి కుటుంబానికి స్నేహితులు 50వేల ఆర్థిక సహాయం
కాకతీయ, నెల్లికుదురు: స్నేహమంటే సంతోషాల్లో తోడుండటమే కాదు.. కష్టకాలంలో అండగా నిలవడమే నిజమైన స్నేహంగా భావించి తమ బాల్యమిత్రుడు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన చిలుక రవి అకాల మరణంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి తోటి స్నేహితులందరూ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ స్నేహితులందరూ కలిసి 50వేల ఆర్థిక సహాయాన్ని సమీకరించి రవి కుమార్తె భవిష్యత్తుకు భరోసాగా ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రవి కుటుంబానికి అందజేశామని తెలిపారు.మా మిత్రుడు మాతో లేకపోయినా.. ఆయన కుమార్తె మా అందరి బిడ్డ. ఆ కుటుంబానికి మేమంతా జీవితాంతం అండగా ఉంటాం అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుతోట సతీష్, మధు నాయక్ , మల్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

