epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!
నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర సదస్సు
ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్‌ పిలుపు
కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండలో ఈ నెల 14న నిర్వహించనున్న ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఐఎల్‌పీఏ) తెలంగాణ ఆరో రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఐఎల్‌పీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, సదస్సు కన్వీనర్‌ చిల్ల రాజేంద్ర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, ఐఎల్‌పీఏ నాయకులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్‌ సిద్ధాంతాల పునాదిగా, అంబేడ్కర్‌ ఇచ్చిన ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ పిలుపును లక్ష్యంగా చేసుకుని ‘నల్లకోట్లతో నీలి విప్లవం’ నినాదంతో సంఘం పనిచేస్తోందన్నారు. బహుజన, అణగారిన, పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం
ఐఎల్‌పీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సదస్సు కో-కన్వీనర్‌ తీగల జీవన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సాంస్కృతిక విప్లవం విజయవంతం కాకుండా బహుజన సమాజ విముక్తి సాధ్యం కాదన్నారు. రాజ్యాంగం కేవలం న్యాయవాదులకు ఉపయోగపడే గ్రంథం మాత్రమే కాదని, బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చే స్ఫూర్తిదాయక సాధనమని పేర్కొన్నారు. ఐఎల్‌పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్‌ మాట్లాడుతూ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు చౌదరి వికాస్‌ పటేల్‌ అధ్యక్షతన సదస్సు జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ సిటిజన్స్‌ కమిషన్‌ కమిషనర్‌ జస్టిస్‌ ఈద తిరుమలదేవి, గౌరవ అతిథులుగా వరంగల్‌, హనుమకొండ జిల్లా జడ్జిలు వి.బి. నిర్మలా గీతాంబ, ఎం.ఆర్‌. సునీత, పంచాయతీరాజ్‌ మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి హాజరవుతారని వివరించారు. ‘79 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ’, ‘ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు’, ‘సామాజిక న్యాయం–బహుజనుల ఐక్యత’, ‘ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం–లోపాలు’ అంశాలపై ప్రొఫెసర్లు ఇ. సుధారాణి, గుగులోతు వీరన్న నాయక్‌, తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ, ఐఎల్‌పీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్‌ ప్రసంగిస్తారని తెలిపారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.జె. శాంసన్‌, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు దాసురాం నాయక్‌, రాష్ట్రీయ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్‌ ఫహీమొద్దీన్‌, బ్యాంసెఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి. నరేందర్‌ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎల్‌పీఏ రాష్ట్ర కమిటీ సలహాదారు బండి మొగిలి, సభ్యులు ఎగ్గడి సుందర్‌ రామ్‌, జన్ను పద్మ, జిల్లా, బార్‌ అసోసియేషన్ల నాయకులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ కాకతీయ,...

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు ఎనుమాముల మార్కెట్‌ కార్యదర్శిని బెదిరించిన ఫ‌లితం నోటీసుల జారీపై...

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు కాకతీయ,...

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి...

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.కోటి నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ...

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల...

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నర్సింహులగూడెం ఎంపీ యుపిఎస్...

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్‌ స్టేషన్‌ రికార్డులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.