విద్యార్థుల పోరాట ఫలితమే జీవో 97 రద్దు
ఐటీఐ, ఏటీసీ విద్యార్థుల విషయంలోనూ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను వెనక్కి తీసుకుందని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం వరంగల్‌లో బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవో రద్దు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి జీవోను ఉపసంహరించుకుందని విమర్శించారు. ఐటీఐ, ఏటీసీ విద్యార్థుల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉద్యమానికి మద్దతిచ్చిన వినయ్ భాస్కర్, బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పానుగంటి శ్రీధర్, వీరస్వామి, తాడిశెట్టి క్రాంతికుమార్, పస్తం అనిల్, రాసూరి రాజేష్, తక్కళ్లపల్లి వినీల్‌రావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

