epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పన్నుల వసూళ్ల సొమ్ము పక్కదారి

పన్నుల వసూళ్ల సొమ్ము పక్కదారి
వసూలైన మొత్తాన్ని 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : కమిషనర్‌ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన ఘటనపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి. వెంకన్న సీరియస్‌ అయ్యారు. ఇకపై ఆస్తి పన్నులు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల రూపంలో వసూలైన ప్రతి రూపాయిని 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలని ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 92 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం రెవెన్యూ, పారిశుధ్య అధికారులతో సమీక్షించారు. బిల్‌ కలెక్టర్లు, వార్డు అధికారులు వసూలు చేసిన మొత్తాలను ప్రతిరోజూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించాలని కమిషనర్‌ ఆదేశించారు. జవాన్ల వారీగా వసూలైన ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సేకరించి, ఖజానాలో జమయ్యాయో లేదో నిర్ధారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వసూలైన పన్నులు, బకాయిలు, జమ చేసిన మొత్తాలపై డివిజన్ల వారీగా పూర్తి వివరాలతో కూడిన సరిచూసిన నివేదికను పది రోజుల్లో సమర్పించాలని సూచించారు. వసూలైన సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం ఇకపై సహించేది లేదని, 24 గంటలు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణిలో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి 44, ఇంజనీరింగ్‌కు 28, రెవెన్యూకు 8, ఆరోగ్య, పారిశుధ్య విభాగానికి 7, నీటి సరఫరాకు 4, ఉద్యానవన విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కమిషనర్‌ సమ్మయ్య, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, సిటీ ప్లానర్‌ రవీంద్ర డీ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, కార్యదర్శి అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ, ఆరోగ్య అధికారి డాక్టర్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం..  మూడు గంటల చర్చల...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.