epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బయ్యారం పిఏసిఎస్ రద్దు.. ప్రత్యేక అధికారి అది నారాయణ ను నియమిస్తూ ఉత్తర్వులు ..!

కాకతీయ, బయ్యారం: బయ్యారం రైతు సహకార సంఘంలో లోపా భూయిష్టమైన అనేక అక్రమాలు జరిగినట్లు అధికారుల పర్యవేక్షణలో వెల్లడైనట్లు.. జిల్లా అధికారులు సొసైటీ పాలక వర్గంను ఈనెల 15న రద్దు చేసినట్లు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కమిటీలో అధికారిక వ్యక్తిని నియమిస్తున్న అంశంపై, బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసిఎస్) వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. సొసైటీ రద్దు కావడానికి ప్రస్తుత పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీ పనిచేయడంలో కొన్ని లొసుగులు, చట్టపరమైన విఘాతం, నిర్లక్ష్యం పలు అంశాల్లో తలెత్తాయని సమాచారం. పాత రుణాలలో మొత్తం 1440 సభ్యుల రైతులకు, రూపాయలు 3,89,30,246.64 బాకీగా ఉన్నాయి. ఇందులో రూ,,3,23,24,484.64 పై లీగల్ యాక్షన్ సొసైటీ తీసుకోలేదు. లాంగ్ టెర్మ్ రికవరీ శాతం (గిల్టీ) 0%. శాతం ఉన్నట్లు సమాచారం.

ఫైనాన్సింగ్ బ్యాంకుతో డబ్బు అప్పులు, అడ్వాన్స్‌లు తప్పుగా ఉన్నట్లు సమాచారం . 2019-20, 2024-25 సంవత్సరాల్లో రూ. 28,30,617.26 తేడా ఉన్నట్లు సమాచారం. రైతుల అప్పుల ఇతర డిఫాల్టర్ల జాబితా తయారు చేయలేదు, పబ్లిష్ చేయలేదని. ఈ వివరాలు ఆడిట్ లో చూపించిన లోపాలను చూపలేదని సమాచారం. కమిటీ మెంబర్స్‌లో వారికి సొసైటీకి డబ్బు బాకీ ఉన్న సభ్యులు ఉన్నారు. సండ్రీ డిబిటర్లు (స్టండరీ డిప్టర్సు ) ద్వారా మొత్తము రూపాయలు 9,24,794.36 రాబడి డబ్బులు జమ చేయలేదు. సొసైటీకి 2024-25లో రూపాయలు 33,06,563.62 నష్టాలు వచ్చాయి, ఘన నష్టాలకు కారణం అ భద్రంగా ఉంది.

ప్రెసిడెంట్, సెక్రటరీ పై ఆరోపణలు వచ్చాయి. సిఇఓ రూపాయలు 1,51,100 సొసైటీ ఫండ్ ఫ్రాడ్ జరిగినట్లు సమాచారం. స్టాక్ వెరిఫికేషన్ లో రూపాయలు 54,37,327.02 డిటెక్టివ్ స్టాక్ కనుగొనబడినట్లు సమాచారం. దీనిపై పాలక మండలి చైర్మన్, డైరెక్టర్ లు తమ రాజకీయ పలుకుబడితో ఎమ్మేల్యే,మంత్రులతో అధికారులకు ఫోన్ లో రాజకీయ పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

దీనిపై మహబూబాబాద్ జిల్లా డిసిఓ వెంకటేశ్వర్లను కాకతీయ ప్రతినిధి ఫోన్ లో వివరణ కోరగా ,బయ్యారం సొసైటీలో అక్రమాలు జరిగినట్లు విచారణ చేసి నిర్ధారణ జరిగిందని, ఈనెల 15 పాలక మండలిని రద్దు చేసి, ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. పాలక మండలి, సొసైటీ చైర్మన్ మూల మధుకరెడ్డిని, తొలగించినట్లు తెలిపారు. వీరి స్థానంలో ప్రత్యేక అధికారిని కోడేటి ఆదినారాయణను నియమించినట్లు తెలిపారు. ఇంకా విచారణ జరగవలసి ఉన్నదని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.