epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2030 నాటికి పర్యాటక గమ్యంగా ఏపీ

  • పర్యాకట శాఖ మంత్రి కందుల దుర్గేష్
  • 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో మంత్రి పర్యటన
  • జాతీయ మిషన్ లో ఏపీ ప్రతిపాదనలు సమర్పణ
  • 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి
  • ఉదయ్ పూర్ లో రెండు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు

కాకతీయ, అమరావతి: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న జాతీయ మిషన్ లో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొననున్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మంత్రి కందుల దుర్గేష్ బృందం హాజరుకానుంది.

ఈ సందర్భంగా జాతీయ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ తరపున పర్యాటక ప్రతిపాదనలను మంత్రి దుర్గేష్ వివరించనున్నారు. ఈ చారిత్రాత్మక సమావేశంలో జాతీయ మిషన్ లక్ష్యాల సాధనకు చేయనున్న కృషి, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధికి అందించే ప్రోత్సాహం, యువతకు ఉపాధి కల్పన, రాష్ట్ర పర్యాటక శాఖలో అవలంభిస్తున్న విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై కూటమి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వెల్లడించనున్నారు. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, పర్యాటకులకు అద్భుత అనుభవాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తున్న తీరుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఏపీని ఒకటిగా నిలిపేందుకు తీసుకోనున్న చర్యలను సమావేశంలో వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన పర్యాటక గమ్యస్థానాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’ లో కేంద్రం అభివృద్ధి చేయనుంది. పర్యాటక సౌకర్యాలు, పరిశుభ్రత, మార్కెటింగ్ ప్రయత్నాలతో సహా సమర్థవంతమైన గమ్యస్థాన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్రాలు అందించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సహకారం, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని, రెండు రోజుల ఉదయ్ పూర్ సమావేశం అనంతరం కేంద్రం ఆమోదంతో మరో రెండు, మూడు పర్యాటక ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.