epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యా ప్ర‌మాణాల‌ను పెంపొందించాలి

  • గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్ర‌భుత్వ‌ లక్ష్యం
  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి విద్యా ప్రమాణాల పెంపు మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన పాఠశాల విద్యా కార్యక్రమాలు వసతుల పరిస్థితి విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ నుండి విద్యార్థుల హాజరు వసతి గృహాలు భోజనశాల క్రీడా వసతులు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

విద్యార్థులు స్వయంగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారా పర్యావరణ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. కిచెన్ గార్డెన్ ద్వారా పాఠశాల భోజనశాలకు తాజా కూరగాయలు లభిస్తాయని చెప్పారు. పాఠశాల పరిసర భద్రత దృష్ట్యా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల మైదానాన్ని ఆటల కోసం అభివృద్ధి చేయాలని విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసే దిశగా తగిన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున విద్యార్థులకు టేబుల్ టెన్నిస్ ఆట సామాగ్రి, క్రీడా పరికరాలను అందజేశారు.

అనంతరం కలెక్టర్ స్వయంగా టేబుల్ టెన్నిస్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. గిరిజన గురుకుల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ అవగాహన వంటి అంశాల్లో కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్యా విధానం గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తును మారుస్తోందని, జిల్లా యంత్రాంగం విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన ప్రతి సదుపాయం కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.