epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీ : సీఎం చంద్రబాబు

 కాకతీయ, అమరావతి: గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా ఏపీని తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్ కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో అధికారులు హాజరయ్యారు.

ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ వేగంగా విస్తరించి జన జీవనంలోకి వచ్చేసిందని.. ఇక భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని సీఎం స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వ్యయం ఎలా తగ్గించాలన్న అంశంపై అధ్యయనం చేసి ప్రజలకు ఆ ప్రయోజనాలను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరో 8.9 శాతం మేర పెరిగే అవకాశముందన్న సీఎం అందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వినియోగించి గ్రీన్ ఎనర్జీలో అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషించాలని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు వీల్లేదని సీఎం అధికారులకు తేల్చి చెప్పారు. నాన్ టారిఫ్ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్ కో వేసిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ను లీజుకు ఇవ్వటం ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని సీఎం అన్నారు.

బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించాలి:

రాష్ట్రంలో 9 శాతంగా ఉన్న విద్యుత్ పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటిని తగ్గించేందుకు ఫీడర్లను సమర్ధంగా నిర్వహించటంతో పాటు ఆయా కేటగిరీల వారిగా విభజించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను స్థానికంగానే వినియోగించుకునేలా చేయటం ద్వారా ట్రాన్స్ మిషన్ నష్టాలను తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. ట్రాన్స్ మిషన్ లైన్లను ఆధునీకరించి సరైన నిర్వహణ చేపడితే పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. గతంలో ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్ చౌర్యం, పంపిణీ నష్టాలను వెలుగులోకి తెచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్యుత్ ఆడిటింగ్ చేపట్టిన తర్వాతే ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను సమర్ధంగా నిర్వహించగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగంపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతీ యూనిట్ కొనుగోలు వ్యయాన్ని రూ.4.80 పైసలకు తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ విజయానంద్ ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు సెన్సార్లు, డ్రోన్లు ఇతర సాంకేతిక పరికరాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసి అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఆస్కారం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ నెలల్లో విద్యుత్ వినియోగం 270 మిలియన్ యూనిట్ల వరకూ పెరిగిందని.. వ్యవసాయానికి కూడా విద్యుత్ వినియోగం పెరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2026 మార్చి నెలల మధ్య కూడా 12,700 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం విద్యుత్ డిమాండ్ కు తగినట్టుగా ఉత్పత్తి పెంచుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లను తగ్గించేందుకు పవర్ స్వాపింగ్ లాంటి విధానాలను అనుసరించాలని సూచించారు.

విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గాలి:

విద్యుత్ ఉత్పత్తి వ్యయం పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషించాలని సూచించారు. విండ్ పొటెన్షియల్ ఉన్న ప్రాంతాల్లో ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తే పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని తద్వారా వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్రతీ యూనిట్ కు రూ.5-6 మేర వ్యయం అవుతోందని.. పవన విద్యుత్ కేవలం రూ4.6 కే యూనిట్ ఉత్పత్తి అవుతోందని అన్నారు. ఏపీలో 65 గిగావాట్ల పవన విద్యుత్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. అటు పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాయలసీమలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ రూ.3.19 లక్షల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు వివరించారు.

సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు వేగవంతం కావాలి:

రాష్ట్రంలో పీఎం- సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ బీసీలతో పాటు ఇతర వర్గాలకు సోలార్ రూఫ్ టాప్ కింద ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేశారన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పురోగతిపై ప్రతీ నెలా తానే స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టామని, దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని విద్యుత్ సంస్థలు అందించే పౌర సేవల్ని వాట్సప్ మన మిత్ర ద్వారా అందించాలని పేర్కొన్నారు.

ఏపీ జెన్కో థర్మల్ యూనిట్లకు అవసరమైన బొగ్గు సేకరణలోనూ కేంద్ర నుంచి సహకారం కోరాలని సూచించారు. మరోవైపు విద్యుత్ ప్రమాదాలు, లో వోల్టేజి సమస్యలు, లీకేజీలు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని స్పష్టం చేశారు. పాత పడిన విద్యుత్ లైన్లను కూడా ఏఐ ద్వారా విశ్లేషించి వాటిని మార్చాలని సీఎం సూచించారు. దీని కోసం ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాంకేతికతను ఉపయోగించాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.