epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎరువుల సరఫరాపై రైతులకు ఆందోళన పడోద్దు: సీఎం చంద్రబాబు

*యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు

*మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు

*గత ఏడాదితో పోలిస్తే 91 వేల మెట్రిక్ టన్నుల అదనంగా యూరియా సరఫరా

*రసాయన ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి

*తక్కువ మొత్తంలో ఎరువులు, పురుగుమందుల వాడే రైతులకు సబ్సిడీలు

*కాఫీ తోటల తెగుళ్లపై తక్షణం చర్యలు చేపట్టాలి

*ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

కాకతీయ,అమరావతి: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇ-క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి. ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని.. వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు.

గతంతో పోలిస్తే ఈసారి 91 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డిఏపి 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని.. గత ఏడాదితో పోలిస్తే 16 వేల మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియచేశారు.దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు.

రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం తగ్గితే సబ్సిడీలు

రసాయన ఎరువులు, పురుగు మందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు వాటి వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలు ఇచ్చే అంశంపై ప్రణాళికలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల వినియోగంపై గణాంకాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

11 ఉద్యాన పంటలకు సాగు ధర దక్కాలి

రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్టే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులు పై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని…దానిని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర ప్రాంతాలకు తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అలాగే తొలగించిన పంటకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని స్పష్టం చేశారు.

వచ్చే మూడేళ్ల పాటు ట్రాప్ లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. మరోవైపు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందిగా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ఉల్లిని స్థానికంగా కమ్యూనిటి హాళ్లను తీసుకుని ఆరబెట్టాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఇప్పటి వరకూ హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రూ.54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని .. మరో రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.