epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లంబాడీలపై అసత్య ప్రచారం సరికాదు..!!

కాకతీయ, గీసుగొండ: లంబాడీలు గిరిజనులు కాదని వారిని గిరిజన జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న అసత్య ప్రచారం సరికాదని బంజారా నాయకులు మండిపడ్డారు. మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి మినీ ఫంక్షన్ హల్‌లో శుక్రవారం రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో బానోత్ రాఘవేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా.. బానోత్ రాఘవేంద్ర మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే దేశ మూల నివాసులని, స్వాతంత్ర్యం రాకముందే గిరిజనులుగా గుర్తింపు పొందామని తెలిపారు. 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చినా, 1931లో నిజాం ప్రభుత్వం చేపట్టిన కులగణనలో గిరిజనులుగా గుర్తింపు పొందామని ఆయన గుర్తు చేశారు.

కేలోత్ స్వామి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో లంబాడిలు గిరిజన జాబితాలో చేర్చబడ్డారని వివరించారు. రేవంత్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పాటు గిరిజన జాబితాలో చేర్చకపోవడం ఘోరమైన అన్యాయం అని ఆరోపించారు.

అనంతరం 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రాంత లంబాడిలకు గిరిజన హోదా కల్పించిందని తెలిపారు.ఇక ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలంటూ పిటిషన్ వేశారని,ఇది లంబాడి సమాజానికి ద్రోహమని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ చర్య కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమేనా అనే ప్రశ్న లంబాడి సమాజంలో తలెత్తిందని నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బోడ హరి నాయక్ మాట్లాడుతూ లంబాడిల గిరిజన హోదాను కాపాడే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.

ఈ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య నిమ్మ నాయక్, వాంకుడోత్ తిరుపతి, కేలోతు బిక్షపతి, బాధావత్ కృష్ణ, మోతిలాల్, ఆంగోత్ స్వామి, బాదావత్ గణేష్, భూక్య సింహాద్రి రాజేందర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.