epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్యాడర్ ఉంది, లీడర్ ఎవరు.?

క్యాడర్ ఉంది, లీడర్ ఎవరు.?
గూడెం బీఆర్ఎస్‌కు నాయ‌క‌త్వ కొర‌త‌
వ‌న‌మా పార్టీ మారుతారంటూ జోరుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం
రాఘవ సస్పెన్షన్ ఎత్తివేయ‌కుంటే క‌ఠిన నిర్ణ‌యానికి స‌న్న‌ద్ధం?
ఉన్న నాయ‌క‌త్వాన్ని వ‌ద‌లుకోవ‌డంపై గులాబీ శ్రేణుల్లో గుస్సా
రాఘ‌వ‌ను పార్టీలో ఆక్టివ్ చేసేందుకూ మొద‌లైన‌ య‌త్నాలు
పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యంపై ఎదురు చూపులు..!!

కాక‌తీయ‌, కొత్తగూడెం ప్రతినిధి : నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భావ‌శీల‌మైన క్యాడ‌ర్ ఉన్న పార్టీకి న‌డిపించే నాయ‌కుడు క‌రువ‌య్యారు. కోల్‌బెల్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేక శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత గులాబీ లీడ‌ర్లు కాస్త డ‌ల్ల‌య్యారు. వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు వ‌య‌సు రీత్య క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొన‌లేక‌పోతున్నారు.

ఆయ‌న త‌న‌యుడు వ‌న‌మా రాఘ‌వ‌పై కొన‌సాగుతున్న పార్టీ స‌స్పెన్ష‌న్ వేటును తొల‌గించేందుకు ఇటీవ‌ల కొంత‌మంది లీడ‌ర్లు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. స్వ‌త‌హాగా మాజీ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు కూడా కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పైనా ఆందోళ‌న‌తో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వ‌య‌స్సురీత్య ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆక్టివ్ పార్టిసీపేష‌న్ నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న వ‌న‌మా.. కొడుకు రాఘ‌వ‌ను పార్టీలో ఆక్టివ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే రాఘ‌వ‌పై గ‌తంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఆయ‌న వ్య‌వ‌హార శైలితో గులాబీ నాయ‌క‌త్వం స‌స్పెన్ష‌న్ వేటు వేసిన విష‌యం తెలిసిందే.

వ‌న‌మా క‌ఠిన నిర్ణ‌యానికి సిద్ధ‌మేనా..?!

త‌న‌యుడు వ‌న‌మా రాఘ‌వను కొత్త‌గూడెం రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేలా చేసేందుకు వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు సీరియ‌స్‌గా ఫోక‌స్ చేస్తున్న‌ట్లుగా ఆయ‌న సన్నిహితులు వెల్ల‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గులాబీ నాయ‌క‌త్వానికి కూడా త‌న మ‌నసులోని మాట‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప‌రిణామం కంటే ముందే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు ఓ జాతీయ పార్టీలోకి మారుతున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కొడుకుపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయ‌కుంటే త‌న దారి తాను చూసుకుంటాన‌ని, త‌మ‌కు కొత్త‌గూడెంలో ఉనికి లేకుండా చేసే రాజ‌కీయ కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని కూడా వ‌న‌మా స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈక్ర‌మంలోనే వ‌న‌మా కుటుంబానికి వ్య‌తిరేకంగా.. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ప్ర‌చారంలో ఉన్న ఓ నేత అనుచ‌ర వ‌ర్గం రాఘ‌వ‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఓ మ‌హిళా లీడ‌ర్‌తో పాటు మ‌రికొంత‌మంది ఈ విష‌యంలో ప‌ట్టుబ‌డుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా కొద్దిరోజుల క్రితం అవుట్ రైట్‌గా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు గులాబీ అధిష్ఠానం నుంచి రాఘవపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు ఓ విస్ప‌ష్ట‌మైన హామీ ఇటీవ‌ల ల‌భించ‌డంతో ఆయ‌న పార్టీ మార్పుపై వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా కూడా గూడెం రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది.

పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యంపై ఎదురు చూపులు..!!

కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గ నాయ‌క‌త్వం కొర‌త‌ను తీర్చేందుకు పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుద‌నే దానిపై శ్రేణులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. వ‌న‌మా ఫ్యామిలీని పార్టీ పూర్తిగా దూరం చేస్తుందా..?! అస‌లు వ‌న‌మా ఓట‌మి త‌ర్వాత క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే వారే లేకుండా ఉన్న ప‌రిస్థితి నుంచి కాస్తో కూస్తో పార్టీని ప‌ట్టించుకుంటాడానే వ‌న‌మా రాఘ‌వ‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు సిద్ధ‌ప‌డి ఆక్టివ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుందా..? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాఘవ‌ర రావాల‌ని కోరుకునే వారెంత మంది ఉన్నారో.. వ‌ద్ద‌ని అనుకునే లీడ‌ర్లు అంతే మంది ఉన్నారు.? లీడ‌ర్ల‌ను ఒప్పించి.. కార్య‌క‌ర్త‌ల‌ను మెప్పించే విధంగా రాఘ‌వ‌కు అనుకూలంగా నిర్ణ‌యం ఉంటుందా..? కొంత‌మంది లీడ‌ర్ల అభిప్రాయానికే అధిష్ఠానం క‌ట్టుబ‌డుతుందా అన్న‌ది మ‌రి కొద్దిరోజులు ఆగితేగాని తేల‌ద‌ని తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.