epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం

మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం
సమ్మక్క–సారలమ్మల వైభవం తరతరాలకూ నిలిచేలా చేస్తాం
వెయ్యేళ్లు శాశ్వ‌తంగా ఉండేలా రాతితో నిర్మాణాలు
ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు రూపొందించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేంకట నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బాలరాం నాయక్, డా.కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.

రాతి కట్టడాలతో చరిత్ర సృష్టి….

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మ గద్దెలు రాబోయే వందల సంవత్సరాలకు ఆదర్శంగా నిలవాలి అని, అందుకే ఈ ప్రాంగణంలో సిమెంట్ కట్టడాలకు బదులు రాతి కట్టడాలతో శాశ్వత నిర్మాణాలు చేపడతాం అని,రుద్రదేవుడు కట్టించిన రామప్ప ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలైనా నిలిచినట్టు ఇక్కడి నిర్మాణాలు వందల ఏళ్లు నిలవాలి అని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. జనవరి 28 నుండి 31  మధ్య జరిగే మహాజాతర నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఆదివాసి సంప్రదాయాలకు ప్రాధాన్యం

ప్రణాళికలు ప్రభుత్వం చేస్తోంది కానీ సాంప్రదాయాలు ఆదివాసులవి అని, నిర్మాణం నుంచి సంరక్షణ వరకు ఆదివాసీల భాగస్వామ్యంతోనే కొనసాగిస్తాం అని సీఎం తెలిపారు. పరిశోధకులు, వారసులు, స్థానిక గిరిజన ప్రతినిధులు నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. జాతరను దేశంలోని కుంభమేళాల తరహాలో జాతీయ పండుగగా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యకు లభిస్తున్న గుర్తింపు, సహకారం లాగే తెలంగాణ ములుగు అడవుల్లో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర కూడా దేశ పండుగగా గుర్తింపును పొందాలి అని ఆయన విన్నవించారు.

సీతక్క కృతజ్ఞతలు!!

కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని, ఆయన సంకల్పంతో ఈ ప్రాంతం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.

వైభవం తరతరాలకు

ప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలతో మేడారం గద్దెల ప్రాంగణం కొత్త అందచందాలతో అలంకరించబడనుంది. రాబోయే జాతర నాటికి యావత్ దేశం, ప్రపంచం నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.