epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మల్లంపల్లి జడ్పిటిసి బరిలో కుసుమ రమాదేవి

మల్లంపల్లి జడ్పిటిసి బరిలో కుసుమ రమాదేవి
జగదీష్ సతీమణికి బిఆర్ఎస్ అవకాశం
జగదీష్ సతీమణికి తోడుగా నిలబడనున్న మల్లంపల్లి
కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇస్తాయా….?
మండలంలో జోరుగా చర్చ…

కాకతీయ, ములుగు ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ములుగు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయిన జెడి మల్లంపల్లి మండలం జడ్పిటిసి స్థానం బీసీ మహిళ రిజర్వేషన్ కింద ఉండటంతో ప్రధాన పార్టీలలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ సతీమణి కుసుమ రమాదేవిను జడ్పిటిసి అభ్యర్థిగా రంగంలోకి దింపే యోచనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మల్లంపల్లి మండలానికి జగదీష్ పేరు…..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల పునర్విభజన సమయంలో ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, అలాగే మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు ఐదేళ్ల పాటు సాగించిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత పొందింది. అప్పటి ములుగు జడ్పీ చైర్మన్‌గా ఉన్న కుసుమ జగదీష్ ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మల్లంపల్లి ప్రజల ఆకాంక్షలను అనేకసార్లు బిఆర్ఎస్ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లి, మండల హోదా సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తు 2023 జూన్ 11న జగదీష్ గుండెపోటుతో మరణించగా, ఆయన కల 2024 నవంబర్ 28న నెరవేరింది. మల్లంపల్లిని మండలంగా ప్రకటించడమే కాకుండా, ఆయన సేవలను గుర్తిస్తూ ఆ మండలానికి “జెడి మల్లంపల్లి” అని నామకరణం చేయడం జరిగింది.

జగదీష్ సతీమణికి మద్దతుగా ప్రజలు……

జెడి మల్లంపల్లి మండలానికి జడ్పిటిసి అభ్యర్థిగా జగదీష్ సతీమణి కుసుమ రమాదేవి పేరును బిఆర్ఎస్ పరిగణనలోకి తీసుకోవడంతో మండలవ్యాప్తంగా చర్చ మొదలైంది. జగదీష్ చేసిన సేవలకు కృతజ్ఞతగా మల్లంపల్లి ప్రజలు రమాదేవి వెంటే నిలబడతారని స్థానికులు చెబుతున్నారు. మల్లంపల్లి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ వర్గాలు రమాదేవికి మద్దతుగా ఉంటారని మండలంలో చర్చ జరుగుతుంది. జగదీష్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన సతీమణి గెలవాలి అన్న భావన మండలంలో స్పష్టంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ మద్దతుపై చర్చ…..

ఇక కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఏ వైఖరి అవలంబిస్తాయన్నదే ఇప్పుడు మల్లంపల్లి రాజకీయాల్లో ప్రధాన చర్చా అంశంగా మారింది. రమాదేవి అభ్యర్థిత్వాన్ని గౌరవప్రదంగా భావించి మద్దతు ఇస్తాయా? లేక తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపుతాయా? అన్న ప్రశ్నలపై మండల వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. జెడి మల్లంపల్లి మండలంలో రాబోయే జడ్పిటిసి ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.