epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఆద‌ర్శం

  • ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం
  • సజీవ ప్రయోగశాలగా న‌గ‌రం
  • జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ కానుందని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన  విధాన సంస్థలతో మార్గదర్శక సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.

అందులో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐఐటి మద్రాస్, శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారి  భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వ్యర్థాలతో  మొదలయ్యే  వాతావరణ ప్రతికూలతలను తగ్గింపే లక్ష్య‌మ‌న్నారు. ముఖ్యంగా  బహిరంగంగా నిర్వహించే డంప్‌సైట్‌లు, వ్యర్థాల నుంచి ఉత్పన్నమయ్యే విషపూరిత వాయువులను నిరోధించాల‌న్నారు. త‌ద్వారా ప్రజల్లో మెరుగైన కాలుష్య ర‌హిత‌, ఆరోగ్య సహ‌కారాన్ని పెంపొందించ‌నున్నామ‌న్నారు. అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు కణ పదార్థాలతో కూడిన విష తుల్యపదార్థాలు మానవ ఆరోగ్యానికి, వాతావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని వివ‌రించారు. సద‌రు సంస్థ‌ల భాగస్వామ్యం ద్వారా, వరంగల్ నగరం లో స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ఆరోగ్య పర్యవేక్షణకు ఒక సజీవ ప్రయోగశాలగా మారడం ఖాయ‌మ‌న్నారు.

వ‌రంగ‌ల్ న‌గ‌రం ఇతర పట్టణ స్థానిక సంస్థలకు స్ఫూర్తి గా నిలువ‌నుంద‌న్నారు.  స్థిరమైన పట్టణ నిర్వహణ పట్ల నిబద్ధత, పౌరుల ఆరోగ్యకరమైన, వాతావరణ-స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఈ సంస్థ కార్పొరేషన్ కు సంపూర్ణ సహకారం అందించనుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు సంస్థ చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ప్రిన్సిపల్ సైంటిస్ట్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ వో రాజారెడ్డి, ఎస్ ఈ సత్యనారాయణ, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్, డాక్ట‌ర్ రాజేష్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్ రెడ్డి, ఈఈ లు రవి కుమార్, మహేందర్, సంతోష్ బాబు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.