epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌

మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌

వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్‌

ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ

ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు పంచాయితీ..

కేబినెట్ భేటీకి ప్రిన్సిప‌ల్ సెక్రటరీ హోదాలో హాజ‌రు

రేవంత్‌రెడ్డితో ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ భేటీ

తెలంగాణలో కలకలం రేపుతోన్న ఐఏఎస్ వీఆర్ఎస్ అంశం

ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్‌, బీజేపీ

వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రులు..ఉన్న‌తాధికారులు !

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఉన్నతాధికారులకు అసలు పడటంలేదనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకోవడంతో మొత్తం వివాదం వెలుగులోకి వచ్చింది. మంత్రితో సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందని తేలింది. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించొద్దని మంత్రి సీఎస్‌కు లేఖ రాయడంతో పంచాయితీ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంతేగాక లేఖ‌లో రిజ్వీపై మంత్రి జూపల్లి సంచలన ఆరోపణలు చేయ‌డం క‌ల‌క‌లంరేపింది. ఇప్పుడిదే అంశం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు

అబ్కారీశాఖప్రధాన కార్యదర్శిగా ఉన్న సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు బదిలీలు, పని చేయనీయడం లేదన్న అసంతప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అవేమీ వీఆర్‌ఎస్‌లో పేర్కొనకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు వివరించారు. దీనికి అనుమతి ఇవ్వాలని కూడా సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

సీఎస్‌కు జూప‌ల్లి సంచలన లేఖ

రిజ్వీ వీఆర్‌ఎస్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌కు సంచలన లేఖ రాశారు. ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. విధుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. దీంతోపాటు శాఖలో ఆయన చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ వేసే కాంట్రాక్‌ను 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇది మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు.

సీఎంతో రిజ్వీ భేటీ..

పాతవారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నారని లేఖలో తెలిపారు. ఇలా ప్రతి పని కూడా సీఎంవోకు, మంత్రిమండలికి సిఫార్స్ చేసి అధిక భారం మోపుతున్నారని వివరించారు. రిజ్వీ చేసిన జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరుగుతుందని లేఖలో వెల్లడించారు. ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి రాసిన లేఖ.. తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఈ వ్య‌వ‌హారం సీఎం రేవంత్‌ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న రిజ్వీతో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయ‌మైంది. మంత్రి జూపల్లితో వివాదం నేపధ్యంలో వీరి భేటీ కీలకంగా మారింది. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో ఇప్పటికే వాలెంటరీ రిటైర్‌మెంట్‌కు అప్లై చేసుకున్న రిజ్వీ.. కేబినేట్ సమావేశానికి ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాలో హాజ‌ర‌వ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి...

ప‌ల్లె పోరు షూరు

ప‌ల్లె పోరు షూరు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వేఢీ ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో 1224...

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట వచ్చే నెల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.