epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

  • కార్పొరేటర్‌ను వెంట‌నే బైండోవ‌ర్ చేయాలి
  • లేకుండా బోరబండ‌లో ఎన్నిక‌లు స‌జావుగా సాగ‌వు
  • కాంగ్రెస్‌కు ఒక న్యాయం.. ఇత‌రుల‌కు మరో న్యాయ‌మా..?
  • అత‌డికి గన్ మెన్లను ఇవ్వడంపై ఈసీని క‌లుస్తాం..
  • పోలీసుల తీరుపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న కాంగ్రెస్ కార్పొరేట‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు. బాబా ఫ‌సీయుద్దీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్ఎస్పీ పోలీసుల‌ను డిమాండ్ చేశారు. ఈమేర‌కు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్థానిక నాయకులు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్ వ‌చ్చి ఇన్‌స్పెక్ట‌ర్‌ను క‌లిసి మాట్లాడారు. బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేద‌ని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు. 5 నెలలు గడిచినా కేసులో పురోగతి ఎందుకు లేదు ? పైగా అతనికే గన్‌మెన్లను ఇచ్చి స్టార్ క్యాంపెయిన‌ర్‌ను చేసి మంత్రుల వెంట తిప్పుతున్నారు అని మండిప‌డ్డారు.

కాంగ్రెస్‌కు ఒక న్యాయం.. ఇత‌రుల‌కు మ‌రొక న్యాయ‌మా..? అని ఎన్నిక‌ల సంఘాన్ని, హైద‌రాబాద్ సీపీని ప్ర‌శ్నించారు. వెంటనే ఈ బాబాను అరెస్ట్ చేసి, రౌడీషీట్ ఓపెన్ చేసి జైలుకు పంపాలి. లేదంటే బోరబండలో ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. బాబా ఫసీయుద్దిన్ ఆగడాలు దారుణంగా ఉన్నాయ‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే వేధింపులకు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. గంజాయి బకెట్లు ఇంట్లో పెట్టి అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నార‌న్నారు. రైతులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే కేసు పెట్టి నల్లబాలు, దిలీప్ కొణతం, గౌతమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు బాబా ఫసీయుద్ధిన్ మాత్రం దొరకడం లేదా అని ప్ర‌శ్నించారు. అరెస్ట్ చేయడం లేదు, బైండోవర్ చేయడంలేదు, కనీసం పోలీస్ స్టేషన్ కు పిలిపించడం లేద‌ని మండిప‌డ్డారు. బాబా ఫసీయుద్దిన్ కు గన్ మెన్లను ఇవ్వడంపై ఎన్నికల కమిషన్, హైదరాబాద్ సీపీని కూడా క‌లుస్తామ‌ని ఆర్ఎస్పీ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.