epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్ర‌మం.. అబ‌ద్ద‌మ‌ట‌..!!.. మ‌ల్లంప‌ల్లి క్వారీలో అస‌లేం జ‌ర‌గ‌లేదంట‌

అక్ర‌మం.. అబ‌ద్ద‌మ‌ట‌..!!
మ‌ల్లంప‌ల్లి క్వారీలో అస‌లేం జ‌ర‌గ‌లేదంట‌
ములుగు జిల్లా మైనింగ్ అధికారుల‌కు క‌న‌బ‌డ‌ని సాక్ష్యాలు
మ‌ల్లంప‌ల్లి మ‌ట్టి దందాపై మైనింగ్ ఏడీ పొంత‌న లేని వివ‌ర‌ణ‌
బాధ్య‌తారాహిత్యంగా రిజాయిండ‌ర్ విడుద‌ల‌పై విమ‌ర్శ‌లు
వాస్త‌వాల‌ను బ‌య‌ట పెడితే..అస‌త్య‌మంట‌రా..? అంటూ జ‌నం నుంచి విమ‌ర్శ‌లు
సాక్ష్యాల‌తో స‌హా ప్ర‌చురించినా అర్థం చేసుకోక‌పోవ‌డం ఎవ‌రి పొర‌పాటు..?
చిత్ర విచిత్రాల‌తో నిజాన్ని అబ‌ద్దం చేసే ప్ర‌య‌త్నం కాదా..?
అనుమానాలు క‌లిగిస్తున్న అధికారుల వైఖ‌రి

ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేని మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి మైన్స్ ప్రాంతంలో ఇటీవ‌ల ఎక్స్‌క‌వేట‌ర్‌తో తవ్వకాలు జరుపుతున్న దృశ్యం

కాకతీయ, ములుగు ప్రతినిధి : అక్ర‌మాన్ని అడ్డుకోలేని అధికారుల త‌త్వం.మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌క్కా స‌మాచారం, ఫొటోల‌తో స‌హా అక్ష‌ర స‌త్యాన్ని అధికారుల‌కు క‌ళ్ల‌కు క‌డితే… అబ్బే అక్క‌డే ఏం త‌వ్వ‌కాలు జ‌ర‌గలేదంటూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం వారి వైఖ‌రిపై అనుమానాలు క‌లిగిస్తోంది. ములుగు జిల్లా మ‌ల్లంప‌ల్లి ప్రాంతంలో జరుగుతున్న మట్టిదోపిడీపై కాక‌తీయ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. మూత ప‌డినా క్వారీ నుంచి, అనుమతుల గ‌డువు ముగిసిన క్వారీల నుంచి మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంటూ క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. ఈ విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే విధంగా ఫొటోల‌ను కూడా క‌థ‌నాల‌కు జ‌త చేసింది.6న కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన “మల్లంపల్లి అడ్డాగా మట్టిదోపిడి” కథనానికి గనులు మరియు భూగర్భశాఖ అధికారులు స్పందిస్తూ ఆ వార్త పూర్తిగా నిరాధారమని, సత్యానికి దూరమని పేర్కొంటూ రిజాయిండర్‌ విడుదల చేశారు. అయితే ఆ వివరణపై స్థానికులు, పత్రిక ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వాస్త‌వ ప‌రిస్థితికి భిన్నంగా.. పొంత‌న లేకుండా అధికారుల స్పంద‌న ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే అధికారుల వివ‌ర‌ణ కూడా ప్ర‌య‌త్నం చేయ‌గా.. నాడు స్పందించని అధికారులు.. మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారుల వివ‌ర‌ణ‌ల‌తో ఇప్పుడు క‌దిలారు.

మాధురి మైన్స్ క్వారీలో ఎలాంటి త‌వ్వ‌కాలు లేవ‌ని అధికారులు విడుద‌ల చేసిన ఫొటో… ఈ ఫొటోలోనే త‌వ్వ‌కాలు జ‌రిగిన‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా.. అధికారులు ఏం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డం విశేషం.

అబ్బే.. అలాంటి త‌వ్వ‌కాలేం లేవు అక్క‌డ‌…

మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకతీయ ప్రతినిధి చేసిన స్థల పరిశీలన మట్టి తవ్వకాలను గట్టిగా చెబుతోంది. మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి మైన్స్ పేరుపై గతంలో తవ్వకాలు జరిగిన క్వారీకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో సంవత్సరం క్రితం తాత్కాలికంగా మూసివేయబడింది. కానీ గత వారం రోజులుగా అదే ప్రదేశంలో భారీ ఎస్కవేటర్‌తో తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. పత్రిక ప్రతినిధి ప్రత్యక్షంగా స్థలానికి వెళ్లి పరిశీలించగా, తాజాగా తవ్విన మట్టిపొరలు, భారీ యంత్రాల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. తనిఖీలలో పాల్గొన్న మైనింగ్ శాఖ ఆర్‌ఐ సిబ్బంది తీసిన ఫోటోలలో కూడా యంత్రాల ట్రాక్ గుర్తులు, మట్టిపొరల తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తున్నా, శాఖ అధికారిక నివేదికలో మాత్రం “ఏమీ లభించలేదు” అని పేర్కొనడం అనుమానాస్పదమని పత్రిక ప్రశ్నించింది.

ఆధారాలతో నిరూపించేందుకు కాక‌తీయ‌ సిద్ధం

మూత‌ప‌డిన క్వారీ నుంచి అక్ర‌మంగా త‌వ్వ‌కాలు జ‌రుగిన‌ట్లుగా కాక‌తీయ వ‌ద్ద పూర్తి స్ప‌ష్ట‌మైన‌,నిర్దిష్ఠ‌మైన ఆధారాలున్నాయి. దీన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉంది. తవ్వకాలు జరిగిన ఖచ్చితమైన స్థలం 18°07’07.4″N 79°52’53.2″E వద్ద ఉందని, ఆ ప్రదేశంలో ఇటీవలే తవ్వకాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలతో నిరూపించగలమని ప్రకటిస్తున్నాం. ప్రజల సొత్తు రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలవంచారా? లేక అక్రమార్కులతో కుమ్మక్కై మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాలు జ‌నం నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్థానిక గ్రామస్తులు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ఇటీవలి కాలంలో రాత్రిపూట లారీలు తిరుగుతున్నాయి, పెద్ద యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన కళ్లముందే జరుగుతుంటే అధికారులు గుర్తించలేదంటుండ‌టం న‌వ్వులాట‌గా అనిపిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.