epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం

రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వ‌లేదు

బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం

ఎల్‌ అండ్‌టీ నష్టాలకు కూడా ఆ పార్టీదే బాధ్య‌త‌

కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్‌ బ్రదర్స్ ..

మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు

రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం.

మీడియా సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్రంలో 2004-2014 మధ్య కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భాగ్యనగరం ఎక్కువగా అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్ (ఔటర్​ రింగురోడ్డు), శంషాబాద్‌ ఎయిర్​పోర్టు, మెట్రో రైలు ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్​ మునిగిపోతే చిల్లిగవ్వ కూడా కేంద్రం ఇవ్వలేదు : 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆక్షేపించారు. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఆయన 2023లో కేసీఆర్‌ తెలంగాణను రూ.8లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్‌కు అప్పగించారని ఆరోపించారు.

ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు?

హైదరాబాద్‌కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ కూడా మంజూరు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్‌ ముగినిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? : బీఆర్ఎస్​ హయాంలో కాళేశ్వరం, సచివాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ప్రగతి భవన్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కుమారుడిని సీఎంను చేయాలని, వాస్తు సరిగా లేదని బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించారని ఆరోపించారు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని ఆక్షేపించారు.

శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్‌ బ్రదర్స్‌

ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే నిర్మించారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని మండిపడ్డారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలోమీటరు కూడా పొడిగించలేదన్న ఆయన మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని విమర్శించారు. మెట్రో నిర్మించిన ఎల్‌ అండ్‌టీ నష్టాలకు కూడా భారత రాష్ట్ర సమితే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కావస్తోంది. భవిష్యత్‌ ప్రణాళికలు ఎలా ఉండాలనే దానిపై విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తున్నాం. మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు కేంద్రానికి ఇచ్చాం. ఆనాడు హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్‌ బ్రదర్స్‌ అనే వాళ్లు. నేడు హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్‌రెడ్డి, కేటీఆర్​లను బ్యాడ్‌ బ్రదర్స్‌ అంటున్నారు. వీరిద్దరూ కలిసి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఫ్యూచర్‌సిటీని అడ్డుకుంటున్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్​కు తేవాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అడ్డంకులు సృష్టిస్తున్నారు

హైదరాబాద్‌ నగరంలో నిర్మించాలనుకున్న పైవంతెనలు, అండర్‌ పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్‌ నుంచి శామీర్‌పేట, మేడ్చల్‌కు ఎలివేటెడ్‌ కారిడార్లకు అప్రూవల్‌ తెచ్చి రూ.5,000 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ రెండు ఎలివేటెడ్‌ కారిడార్లపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ వాటి అనుమతులకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్​పోర్ట్​ల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. అదనంగా కొత్తగూడెం, రామగుండం విమానాశ్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

క‌బ్జాల‌పైనా రాజ‌కీయం చేస్తున్నారు

‘కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటి ఆరు నెలలు సార్వత్రిక ఎన్నికలతో గడిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో పనిచేసింది ఏడాదిన్నర మాత్రమే. ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను(ఔటర్​ రింగురోడ్డు) కేవలం రూ.7వేల కోట్లకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమ్ముకుంది. చెరువుల్లోని కబ్జాలను తొలగించి పునరుద్ధరిస్తే దానిపై రాజకీయం చేస్తున్నారు. ప్రజలను ఓటు అడుగుతున్నా మీ ఓటు ద్వారా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.