epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణను అగ్ర‌భాగాన నిలబెడుతాం

తెలంగాణను అగ్ర‌భాగాన నిలబెడుతాం
ప్రపంచ పటంలో తెలంగాణ‌కు ప్ర‌త్యేక గుర్తింపు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
రాష్ట్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు అండగా నిలిచింది
ముగ్గురు కీల‌క మంత్రులు ఈ జిల్లాకు చెందిన‌వాళ్లే
పాల్వంచ నుంచే తెలంగాణ ఉద్య‌మం ప్రారంభమైంది
దేశంలోనే ఏకైక‌ ఎర్త్ యూనివ‌ర్సిటీకి మ‌న్మోహ‌న్‌సింగ్ పేరు గ‌ర్వ‌కార‌ణం
ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్ రంగాలే మా ప్రాధాన్యాలు
గ్రామాల్లో స‌ర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి
రాజ‌కీయ క‌క్ష‌లు మానండి.. ప‌దేళ్లు అండ‌గా నిల‌బ‌డండి
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ ప్రారంభం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో / కొత్త‌గూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లా సంపూర్ణంగా ఆశీర్వ‌దించి ప్ర‌భుత్వానికి అండగా నిల‌బ‌డ్డ‌ద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్త‌గూడెం.. అందుకే తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ను నేర‌వేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పేరు ఇక్కడి ఎర్త్ యూనివ‌ర్సిటీకి పెట్ట‌డం గొప్ప అవ‌కాశం అన్నారు. కొత్తగూడెంలో వర్సిటీని ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. అనంతరం వ‌ర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ సభలో సీఎం ప్ర‌సంగించారు. తెలంగాణను సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమని రేవంత్ అన్నారు. కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనేనని తెలిపారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్ రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రంను నిలబెడుతున్నాయని వివరించారు.

సర్పంచ్‌లు మంచివాళ్లు ఉండాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల కోరారని గుర్తు చేశారు. ఖమ్మం మంత్రుల చేతుల్లోనే పాలనకు ఆయువుపట్టయిన శాఖలు ఉన్నాయని అన్నారు. భ‌ద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖ‌మ్మం జిల్లా అభివృద్ధి బాధ్య‌త నాది.. ప్ర‌జా పాల‌న‌తో సుప‌రి పాల‌న అందిస్తున్నాం.. మంచి పాల‌న ఉంటే ఉచిత క‌రెంటు, రేష‌న్ కార్డుల పంపిణీ, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, చీర‌లు లాంటి వ‌స్తాయి. అందుకే గ్రామాల్లో స‌ర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి.. మంత్రుల‌తో క‌లిసి ప‌నిచేసే వాళ్లు కావాలి. అభివృద్ధి కోసం మంచి స‌ర్పంచ్‌ల‌ను ఎన్నుకోవాలి. గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మానండి. ప‌దేళ్లు అండ‌గా నిల‌బ‌డండి. తెలంగాణ‌ను దేశంలో అగ్ర‌గామిగా నిల‌బ‌డ‌దాం.. అని రేవంత్ అన్నారు.

ఖ‌మ్మం నుంచే ఏ ప‌థ‌కమైనా..

ప‌దేళ్లు ప్ర‌ధాన మంత్రిగా మ‌న్మోహ‌న్‌సింగ్ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకుపోయారు. దేశంలో ఉన్న ఆక‌లి కేక‌ల‌ను చూసి ప్ర‌పంచంతో పోటీ ప‌డాల‌ని తొలి ప్ర‌ధాని నెహ్రు ఎడ్యుకేష‌న్ పాల‌సీ తీసుకువ‌చ్చి గొప్ప గొప్ప‌ యూనివ‌ర్సిటీల‌ను ప్రారంభించారు. దేశంలో అహార ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డానికి బాక్రానంగ‌ల్ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ వ‌ర‌కు అనేక‌ ప్రాజెక్టుల‌ను నెహ్రు క‌ట్టించారు. విద్య మాత్ర‌మే తెలంగాణను ఉన్న‌త‌స్థానంలో నిల‌బెడుతుంది. అందుకే ఆవైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. సింగ‌రేణిలాంటి సంస్థ‌ల‌ను పెంచాలంటే ఎర్త్ యూనివ‌ర్సిటీ లాంటివి అవ‌స‌రం. కృష్ణా, గోదావ‌రి జలాల‌తో ఖ‌మ్మం జిల్లా పొలాల‌ను పారించి సిరులు కురిపించాల‌ని మా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు 10 యేళ్లు నిర్లక్ష్యానికి గుర‌య్యాయి. గ‌త పాల‌కుల‌కు క‌మిష‌న్లు కురిపించాయి త‌ప్ప నీళ్లు పార‌లేదు. తెలంగాణకు నేను సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ ఖ‌మ్మం జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల అనుకుంటే ఏమైనా జ‌రుగుతుంది. ఖ‌మ్మం జిల్లా అభివృద్ధికి నిధులు, అనుమ‌తులు మంజూరు చేసే బాధ్య‌త నాది. రేష‌న్ కార్డుల పంపిణీ, స‌న్న‌బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, ఇందిర‌మ్మ చీర‌లు.. ఏ కార్య‌క్ర‌మైనా ఖ‌మ్మం జిల్లా నుంచే ప్రారంభించాం.. అని రేవంత్ అన్నారు.

త్వరగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తాం : భ‌ట్టి

దేశంలోనే అత్యున్నతమైన వర్సిటీని కొత్త‌గూడెంలో ప్రారంభించుకున్నామ‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ అనేది దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అద్భుతమైన వర్సిటీకి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారని, మన్మోహన్‌ సింగ్ ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ దేశానికే తలమానికమని కొనియాడారు. వీలైనంత త్వరగా వర్సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మన్మోహన్‌ సింగ్‌ రాష్ట్రాన్ని ఇచ్చారు : పొంగులేటి

మాజీ ప్ర‌ధాని మన్మోహన్‌ సింగ్ పేరుతో ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ ఇచ్చిన ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వం మన్మోహన్‌ సింగ్‌ పేరుతో ఒక్క పథకం కూడా పెట్టలేదని విమర్శించారు. మీ దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వంపై ఎప్పుడూ ఉండాలని కోరారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు : తుమ్మ‌ల‌

కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ భూవిజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమివ్వనున్న వర్సిటీ అని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంద‌న్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు త‌దిత‌రులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.