epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి

చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి
క‌లెక్ట‌ర్ జితేష్ ప‌టేల్‌
చర్ల మండలంలో విస్తృత పర్యటన
ఎన్నిల‌క సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ప‌రిశీల‌న‌

కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రేష్టతో కలిసి విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డు ఎమర్జెన్సీ గైనకాలజీ పీడియాట్రిక్ లేబర్ రూమ్ ల్యాబ్ ఫార్మసీ మొత్తం మౌలిక సదుపాయాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు ఔషధాల లభ్యత పరికరాల పనితీరు పరిశుభ్రత వైద్య సిబ్బంది హాజరు రికార్డులు పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డ్ లో ఉన్న రోగులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్న చిన్నచిన్న లీకేజీలు మరమ్మతులు గుర్తించిన కలెక్టర్ తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు అభివృద్ధి పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని వైద్య అధికారిని ఆదేశించారు. గర్భిణుల‌కు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.

ఎన్నిల‌క సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ప‌రిశీల‌న‌

అనంత‌రం కలెక్టర్ చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి కౌంటర్‌ను పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న సామగ్రి పంపిణీ విధానాన్ని చెక్‌లిస్ట్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరు భద్రతా సిబ్బంది హాజరు డబుల్ లాక్ సిస్టమ్‌ను పరిశీలించి ఎటువంటి భద్రతా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించడానికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలింగ్ సిబ్బందికి అవసరమైన సహకారం తక్షణమే అందించాలన్నారు. అనంర‌తం కలెక్టర్ సుబ్బంపేట గ్రామంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులు వికలాంగులకు ఏర్పాటు చేసిన ర్యాంపులు త్రాగునీరు విద్యుత్ టాయిలెట్ సదుపాయాలు వెబ్‌కాస్టింగ్ కోసం అమర్చిన వీడియో కెమెరాల పనితీరును సమీక్షించారు. పోలింగ్ రోజున ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో అమలులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఆర్.కొత్తగూడెంలోని శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు బర్ఫీ చాక్లెట్ టీ పొడి నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్పపువ్వు సేకరణ విధానం నాణ్యత నిల్వ విధానాలు మార్కెటింగ్ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవసరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పపువ్వు ఎండబెట్టేందుకు సోలార్ డ్రైయర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సాయి వర్ధన్, డాక్టర్ కాంత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రావణి, చర్ల ఎంపీడీవో, ముత్యాలమ్మ జాయింట్ లైబిలిటీ యూనిట్ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.