epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మేడారం మార్గం మరింత అభివృద్ధి చేస్తాం
: మంత్రి సీతక్క
ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
కోటి రూపాయలతో గిరిజన బాలికల జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం
ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాల ఆవిష్కరణ
జంపన్నవాగుపై కరకట్టకు రూ.1.95 కోట్లతో శంకుస్థాపన

కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ భవనం ద్వారా విద్యార్థినులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం జంక్షన్‌లో అభివృద్ధి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ మహిళల నృత్యాల విగ్రహాలు, బాణాల విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.38 లక్షల వ్యయంతో ఈ విగ్రహాలను నిర్మించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఇవి నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

ఏటూరునాగారం మండలం బుటారం గ్రామంలో జంపన్నవాగుపై కరకట్ట నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల ఆయకట్టు శాఖ ద్వారా రూ.1.95 కోట్లతో మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ప్రతి ఏడాది వరదలతో ముంపుకు గురయ్యే బుటారం గ్రామాన్ని కరకట్ట నిర్మాణంతో రక్షిస్తామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల, సీనియర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.