epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అలీ సాగర్ నీటిని విడుదల చేయాలి

అలీ సాగర్ నీటిని విడుదల చేయాలి

48 వేలకుపైగా ఎకరాలను కాపాడాలి

యాసంగి సీజన్ ప్రారంభమైనా ప‌ట్టింపు లేదు

తైబందీ ఖరారు కాలేదనే కారణంతో రైతుల‌ను హింసించొద్దు

ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి అన్న‌దాత‌లను ఆదుకోవాలి

తెలంగాణ జాగృతి కళాకారుల‌కు ఉద్యోగాలివ్వాలి

ఇందిరా పార్క్ వ‌ద్ద వారి ఆందోళ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: అలీ సాగర్ ఎత్తిపోతల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని 48 వేలకుపైగా ఎకరాల్లో అలీసాగర్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని గుర్తుచేశారు. యాసంగి సీజన్ ప్రారంభమైనా నీటిని విడుదల చేయకపోవడంతో మూడు నియోజకవర్గాల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. యాసంగి సీజన్ తైబందీ ఖరారు కాలేదనే కారణంతో ఇరిగేషన్ ఇంజనీర్లు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. రైతులు వరి నార్లు పోసుకొని నెల రోజులవుతోందని, తక్షణమే నీటిని విడుదల చేయకుంటే నార్లు ముదిరిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోతలు ప్రారంభించక పోవడం సరికాదన్నారు. ఒక్క నవీపేట మండలంలోనే 14 వేల ఎకరాల్లో అలీ సాగర్ కింద యాసంగి పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. యాసంగి వరి నాట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వలస వచ్చారని, నీటి విడుదల లో జాప్యం కారణంగా రైతులతో పాటు వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలీ సాగర్ ఎత్తిపోతలు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ

తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆందోళ‌న‌కు తాము సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఇందిరా పార్క్ వద్ద కాళాకారులు చేపట్టే ఆందోళనలో పాల్గొంటామ‌ని హామీ ఇచ్చారు. సోమ‌వారం హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాల‌యంలో తెలంగాణ ఉద్యమ కళాకారులు క‌విత‌తో భేటీ అయ్యారు. త‌మ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరగా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన‌వి మాట.. పాట.. ఎందరో పెద్దవాళ్లు తమ మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తే.. కళాకారులు ఊరూరా గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింద‌న్నారు. ఉద్యమ ఆకాంక్షను నిలబెట్టింది కూడా తెలంగాణ పాటే.. వేలాది మంది కళాకారులు ఊరూరా తిరిగి గజ్జకట్టి ఆడిపాడార‌ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు.. అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రానివాళ్లు ఇంకా ఉన్నారు.. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల‌ని క‌విత డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.