epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘ఆది కర్మయోగి’కి దిల్ రాజు ప్రశంసల జల్లు

‘ఆది కర్మయోగి’కి దిల్ రాజు ప్రశంసల జల్లు

కాక‌తీయ‌, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు నటించిన ‘ఆది కర్మయోగి’ లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘బతుకమ్మ యాంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్’ పోటీల్లో ఈ లఘు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ‘ఆది కర్మయోగి’ చిత్రాన్ని మంత్రి, దిల్ రాజు ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.

ఏజెన్సీ గిరిజనుల జీవన వేదన

తెలంగాణ ప్రజా పాలన ప్రారంభమైన తర్వాత అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ లఘు చిత్రం, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో రహదారులు లేని గ్రామాల్లో గిరిజనులు పడే అవస్థలను హృద్యంగా ఆవిష్కరించింది. సహజత్వంతో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలిం పోటీలకు సుమారు 550 లఘు చిత్రాలు పోటీ పడగా, ‘ఆది కర్మయోగి’ ప్రైజ్ మనీ దక్కించుకోలేకపోయినా, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం చర్ల ఆదివాసీ యువతకు గర్వకారణంగా నిలిచింది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఆదివాసీ యువకులు నటనతో గుర్తింపు పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ లఘు చిత్రంలో చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు కోర్సా శివప్రసాద్, కారం వైష్ణవి, మడివి మహేష్, తెల్లం కవిత, మీడియం అర్జున్, మునగల నానాజీ, దుబ్బ వినోద్, కుంజ అశోక్లు నటించి మెప్పించారు.
జి. లక్ష్మణ్ కుమార్ దర్శకత్వం వహించగా, సరవణన్ నిర్మాతగా వ్యవహరించారు. సాగర్ పర్యవేక్షణలో చిత్రం రూపుదిద్దుకుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల గొంతుకగా నిలిచిన ‘ఆది కర్మయోగి’ లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఆనందదాయకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.