epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఏదులాపురం మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.   మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ లో ఏదులాపురం చెరువు నాలాపై రూ. 20.25 లక్షలతో చేపట్టనున్న కల్వర్ట్ నిర్మాణ పనులకు, సాయి గణేష్ నగర్ లోని ఎన్.ఎస్.పి. కాల్వపై రూ. 15.70 లక్షలతో చేపట్టనున్న కల్వర్ట్, పోలేపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో రూ. 25 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులకు మంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు ఏదులాపురం మున్సిపాలిటీలో 2 కల్వర్ట్ లు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో అవసరమైన సిసి రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

అభివృద్ధి ప‌నుల్లో వెన‌క‌డుగు లేదు

ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో వందకు వంద శాతం ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామని, దాంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసి ఏదులాపురంను రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని తెలిపారు. శాశ్వతంగా త్రాగునీటి తో సహా స్థానికంగా కావలసిన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తుంద‌న్నారు. పాలేరు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఏదులాపురం మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పోలేపల్లి డబల్ బెడ్ రూంల 56 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ బాబు, ఎదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.