epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యూరియా అవసరానికి మించి కొనొద్దు

యూరియా అవసరానికి మించి కొనొద్దు
జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల స్టాక్ సిద్ధం
ప్రతి రైతుకూ యూరియా అందేలా చర్యలు
మొక్కజొన్న పంట సాగు మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
పోలీస్ కమిషనర్‌తో కలిసి కొణిజెర్లలో యూరియా కేంద్రాల తనిఖీ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కొణిజెర్ల మండలం కొణిజెర్ల, గోపవరం సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. యూరియా కొనుగోలు ప్రక్రియ, క్యూల నిర్వహణ, కూపన్ల జారీ విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో యూరియా కేంద్రాలను పరిశీలిస్తూ రైతుల్లో ఉన్న అనవసర ఆందోళనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇందులో మార్క్‌ఫెడ్ వద్ద 8,822 మెట్రిక్ టన్నులు, ప్యాక్స్ వద్ద 917 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 944 మెట్రిక్ టన్నులు, గత నిల్వలుగా 2,495 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు.

మొక్కజొన్న పంట సాగు మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు

మొక్కజొన్న సాగు అధికంగా ఉన్న కొణిజెర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని, అందుకే అక్కడ అదనంగా సేల్ పాయింట్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి 2,000 ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సేల్ పాయింట్ ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. కొణిజెర్ల మండలంలో ఇప్పటికే ఉన్న 7 సేల్ పాయింట్లకు తోడు మరో 9 కొత్త సేల్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అధిక వినియోగంతో పంటకే నష్టం

యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో ముందుగానే సమాచారం ఇస్తూ కూపన్లు జారీ చేస్తున్నామని, కాబట్టి రైతులు సూచించిన సమయానికి వచ్చి యూరియా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే రైతు తన సాగు విస్తీర్ణానికి అవసరమైన దానికంటే ఎక్కువగా యూరియా తీసుకోరాదని హెచ్చరించారు. అధికంగా యూరియా వాడటం వల్ల పంటకు కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో దొరకదన్న అనుమానంతో నిల్వ చేసుకుంటే యూరియా నాణ్యత తగ్గి పంట నష్టానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ ఎం. అపూర్వ, ఏడీఏ కరుణశ్రీ, మండల వ్యవసాయ అధికారి బాలాజీ, కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.