epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?!

త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?!
అబద్దాల పోటీలు పెడితే కాంగ్రెస్–బీఆర్ఎస్‌కే అవార్డులు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కేసీఆర్ తాకట్టు పెట్టారు
యూపీఏ విభజన చట్టంతోనే తెలంగాణ‌కు అన్యాయం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వాటా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన ఘోర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘హైదరాబాద్‌లో జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తొలి రెండు అవార్డులు ఖాయంగా దక్కుతాయి’’ అని ఎద్దేవా చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకే సరిపోతుందని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నదే చరిత్రలో అతిపెద్ద ద్రోహమని బండి సంజయ్ ఆరోపించారు. 2015 జూన్ 19న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీకి అనుకూలంగా కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడే తానే బయటపెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టడం పూర్తిగా అవగాహనలేమి ఫలితమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డికి వినియోగించుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయితే 90 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన సమగ్ర వివరాలు పంపకపోవడంతోనే డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిందని, తిరస్కరించలేదని తెలిపారు. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు.

యూపీఏ విభజన చట్టమే మూలకారణం

తెలంగాణకు మొదటి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన చట్టం–2014లోని సెక్షన్ 89 కారణంగా బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను టచ్ చేయరాదని నిబంధన పెట్టి తెలంగాణను దెబ్బతీశారని విమర్శించారు. ఈ పరిమితుల వల్లే కొత్త ట్రైబ్యునల్ కూడా నీటి కేటాయింపులపై పూర్తిగా విచారణ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూపీఏ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 6న కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేసి కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశాన్ని కల్పించిందని గుర్తు చేశారు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా టెక్నికల్, లీగల్ వాదనలు వినిపించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇకనైనా నీటి కేటాయింపులు, డీపీఆర్ రూపకల్పనలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంగీకరించి తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీని దూషణలకు వేదికగా మార్చకుండా తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.