epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తూర్పులో ట‌ఫ్ జాబ్‌

తూర్పులో ట‌ఫ్ జాబ్‌
పోలీసుల‌కు విధి నిర్వ‌హ‌ణ క‌త్తిమీద సామే..!
ఒక‌రి మాట వింటే మ‌రొక‌రికి కోపం
ఫ‌లితంగా బదిలీలు..సస్పెన్షన్లు..! లేదంటే ఫిర్యాదులు
ఖాకీల‌పై ఒత్తిళ్లు.. మాన‌సిక‌ నైతిక స్థైర్యం కోల్పోతున్న అధికారులు
ఇలా అయితే ఏం ప‌నిచేస్తామంటూ ఉన్న‌తాధికారుల వ‌ద్ద నిర్వేదం

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పోలీసు అధికారుల బదిలీలు, సస్పెన్షన్ల అంశం శాఖా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఏర్పడుతున్న ఒత్తిళ్లు, తీసుకుంటున్న పరిపాలనా నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది చట్టం, నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న సందర్భాల్లో వివిధ స్థాయిల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అధికారులను అకస్మాత్తుగా బదిలీ చేయడం, మరికొందరిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడం జరగడంతో శాఖలో ఆందోళన వాతావరణం నెలకొంది.

పోస్టింగులు.. బదిలీలపై అసంతృప్తి

సున్నితమైన కేసుల్లో చట్టపరంగా చర్యలు తీసుకున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో, వారిని కీలక బాధ్యతల నుంచి తొలగించడం లేదా లూప్ లైన్ పోస్టింగులకు పంపడం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీని వల్ల విధి నిర్వహణలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంపై అధికారులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పనిచేసినా, అనూహ్యంగా బదిలీలు లేదా సస్పెన్షన్లు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో పోలీసు సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. శాఖాపరంగా మద్దతు లభించకపోతే విధి నిర్వహణలో ధైర్యం తగ్గే అవకాశముందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో నిజాయితీగా పనిచేసే అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, దీని ప్రభావం శాంతిభద్రతల పరిరక్షణపై కూడా పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంతర్గతంగా చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇలా అయితే ఎలా సార్‌..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ లేదా ఇతర జోక్యాల‌తో సంబంధం లేకుండా.. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే శాఖా పరిపాలన సమర్థవంతంగా కొనసాగుతుందని పోలీసు వర్గాలు ఉన్న‌తాధికారుల వ‌ద్ద మొర పెట్టుకుంటున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. రాజకీయ ఒత్తిళ్ల మధ్య చట్టప్రకారం నిర్ణయాలు తీసుకోవడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఒక వైపు నిబంధనలు పాటించాల్సి రావడం, మరోవైపు రాజకీయ నేతల ఆగ్రహానికి గురికావాల్సి రావడం వల్ల “ముందు నుయ్యి.. వెనక గొయ్యి” అన్న పరిస్థితి ఏర్పడింది. వరంగల్ తూర్పులో నేతల ఆధిపత్య పోరు వల్ల పోలీసు యంత్రాంగం నైతిక స్థైర్యం కోల్పోతుందని, ఇది శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.