epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!
ప్రజాస్వామ్యంపై ట్రంప్‌ దండయాత్రను ఖండించాలి
అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అవసరం
కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజీఎస్‌లో మార్పులు
శాసనసభకు రాని వారు రాజీనామా చేయాలి
జనవరి 18న సీపీఐ చారిత్రిక సభ
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ

కాకతీయ, ఖమ్మం : సంపద కోసమే అమెరికా వెనుజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ చేస్తున్న దాడిని యావత్ ప్రజలు ఖండించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా పేరిట చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వెనుజులాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ అక్కడి అధ్యక్షుడు, ఆయన భార్యను బంధీలుగా చేశారని నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంపై చర్చకు అవకాశం ఉన్నా దాన్ని పక్కనబెట్టి ట్రంప్ ప్రపంచ పోలీస్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. గతంలో అణుఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చారని, ఆ తర్వాత అణుఆయుధాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

భారత్‌కు ముప్పే
వెనుజులాపై దాడి భారతదేశానికి కూడా నష్టమేనని, ఆయిల్ ఎగుమతుల పేరుతో భవిష్యత్తులో అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశాలపై విదేశీ శక్తులకు దాడి చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎన్ఆర్ఈజీఎస్) మార్పులు కార్పొరేట్ సంస్థల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. 40 కుటుంబాలకు రూ.28 లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి జంకుతోందన్నారు. జీఎస్టీ రూపంలో దోపిడీ చేస్తున్న కేంద్రం వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభను బైకాట్ చేసి వేతనాలు పొందటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ, సభకు వెళ్లని ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నారు.

జనవరి 18న చారిత్రిక సభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న చారిత్రిక సభ నిర్వహిస్తున్నామని నారాయణ తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని, 15 రోజుల పాటు సభలు, సమావేశాలు, సదస్సులతో ప్రచారం కొనసాగుతుందన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.