epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శాంతి భద్రతల్లో ఏఆర్ పాత్ర కీలకం!

శాంతి భద్రతల్లో ఏఆర్ పాత్ర కీలకం!
వ‌రంగ‌ల్ సీపీ స‌న్ ప్రీత్‌సింగ్‌
సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ వార్షిక తనిఖీలు
ఆక‌ట్టుకున్న రుద్రమ ఉమెన్స్ స్పెషల్ ఫోర్స్ విన్యాసాలు

కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉదయం పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకున్న కమిషనర్‌కు ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్‌ను కమిషనర్ తిలకించారు.

ఆయుధ పరిజ్ఞానం, శిక్షణపై ప్రత్యేక దృష్టి
తనిఖీల సందర్భంగా సిబ్బంది ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానం, ఆయుధాల వినియోగ విధానాలు, ఆయుధ పరేడ్, వ్యాయామం, యోగా వంటి అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విభాగాల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి క్షేత్రస్థాయిలోనే రివార్డులు ప్రకటించి ప్రోత్సహించారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, మోటార్ విభాగం, ఆయుధాగారం వంటి విభాగాల పనితీరును పరిశీలించిన కమిషనర్, సిబ్బంది పనితీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన అనంతరం కమిషనర్ ఆదేశాలతో తొలిసారిగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు కమాండో తరహా శిక్షణ, దేహదారుఢ్య శిక్షణ, ఆయుధ శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి అమర్చడం వంటి క్లిష్టమైన విన్యాసాలను ప్రదర్శించారు. వాటిని తిలకించిన కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. తనిఖీల అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, సిబ్బంది అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, శాఖాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్‌కుమార్, శ్రీనివాస్, రవి, ట్రైనీ ఐపీఎస్ మనిషా నేహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఐలు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.