epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం

కమ్యూనిస్టుల ఐక్యత అత్య‌వ‌స‌రం
పోరాట పంథాలో మార్పు అనివార్యం
సంపద దోచుకునేవారే దేశభక్తులా?
శతాబ్ది ఉత్సవాలు చారిత్రక ఘట్టం
వేడుకల్లో ఖ‌మ్మం జిల్లా భాగస్వామ్యం గర్వకారణం
కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిజం అజరామరమని, ప్రజల్లో మరింత చైతన్యం కోసం కమ్యూనిస్టులుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం వేదికగా జరపడం ఓ చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. యువత ఓ చట్రంలో బిగుసుకు పోవడం సరైంది కాదని, కాలానికి అనుగుణంగా పోరాట పంథాలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సాంబశివరావు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం సమాజం అనుభవిస్తున్న కార్మిక, కర్షక ఫలాలు కమ్యూనిస్టుల దీర్ఘకాల పోరాటాల ఫలితమేనని కూనంనేని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు, విధానాలు, త్యాగాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

సంపద దోచుకునేవారే దేశభక్తులా?

అటవీ సంపదను, ప్రజల శ్రమను దోచుకునేవారు దేశభక్తులుగా చెలామణి అవుతుండగా, హక్కుల కోసం పోరాడేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని కూనంనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరప్రవృత్తి కలిగినవారు, దోపిడీ చేసేవారు, డబ్బు సంపాదించేవారే దేశభక్తులుగా మారుతున్న పరిస్థితి దురదృష్టకరమన్నారు. కాళోజీ మాటలను గుర్తు చేస్తూ… “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అయితే, ఒక్క కమ్యూనిస్టు లక్షల కోట్ల మెదళ్లకు మేథ” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తుగడలు ఎలా ఉన్నా అవి ఎన్నికల వరకే పరిమితమని, కమ్యూనిస్టుల ఐక్యతే తమ అభిమతమని కూనంనేని స్పష్టం చేశారు. మనుషులు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పారు. అనేక దేశాల్లో ఎర్రజెండాలు ఏకమై రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత ప్రజల కోరికేనని, దేశానికి–సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు. బూర్జువా పార్టీలతో సందర్భోచితంగా కలిసి పనిచేయడం అనివార్యమని, అది ఎన్నికల వ్యూహంలో భాగమేనని తెలిపారు. ప్రభుత్వం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అప్రజాస్వామిక పోకడలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నామని అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. భారీ బహిరంగ సభతో పాటు ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల కామ్రేడ్స్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరవుతారని వెల్లడించారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌహార్ద సందేశం ఇస్తారని తెలిపారు.

వేడుకల్లో భాగస్వామ్యం గర్వకారణం

శతాబ్ది ఉత్సవాల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పాలుపంచుకోవడం గర్వంగా ఉందని జిల్లా సీపీఐ కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. ఉద్యమాలకు ఊపిర్లూదిన ఖమ్మంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్, టీబీజేఏ, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, సీపీఐ రాష్ట్ర–జిల్లా–నియోజకవర్గ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.