epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాణ్యతలో రాజీ వద్దు

నాణ్యతలో రాజీ వద్దు
సింథటిక్ ట్రాక్ పనులు గడువులోపే పూర్తి చేయాలి
యువతకు ఆధునిక క్రీడా సౌకర్యాలు
సర్దార్ పటేల్ స్టేడియం క్రీడా హబ్‌గా అభివృద్ధి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు ఉండరాదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరగాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన టేబుల్ టెన్నిస్ హాల్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.

నాణ్యతతో పనులు జరగాలి

పరిశీలన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాక్ లెవెలింగ్, ఫెన్సింగ్, బాండింగ్, లైన్ మార్కింగ్ పనులు ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం జరగాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కార్బోచాంబర్లు నిర్మించాలని సూచించారు. స్టేడియంలో సరిపడా వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని, పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా సాగాలని, నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా రోజువారీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను హెచ్చరించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు.

యువతకు గొప్ప అవకాశం

ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లాను క్రీడా రంగంలో ముందంజలో నిలపాలనే ఉద్దేశంతో సర్దార్ పటేల్ స్టేడియాన్ని ఆధునిక క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్న టేబుల్ టెన్నిస్ హాల్, రన్నింగ్ ట్రాక్ తదితర సదుపాయాలను యువత, విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నిర్వహణకూ ప్రత్యేక ప్రణాళిక

నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. సింథటిక్ ట్రాక్‌ను దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ప్రత్యేక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని, అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, స్టేడియం అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డీఈ నవీన్, ఉద్యానవన అధికారిణి రాధిక, క్రీడాకారులు, కోచ్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.