epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణకు నిధుల వరద‌

తెలంగాణకు నిధుల వరద‌
స్థానిక సంస్థలకు రూ.260 కోట్లు విడుదల చేసిన కేంద్రం
మిగిలిన రూ.2,500 కోట్లు దశలవారీగా మంజూరు
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధుల విడుదల
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వేగవంతమైన నిర్ణయం
గతంలో రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రం సూచన

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే నిధులు విడుదల కావాలని ఆయన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. గత దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం రూ.5,060 కోట్లు విడుదల చేయగా, 2020–21 నుంచి 2025–26 మధ్య ఈ కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.6,051 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు వివరించారు.

యుటిలైజేషన్ సర్టిఫికెట్లతో నిధుల విడుదల..!

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించడంతో 2024–25 సంవత్సరానికి మొదటి విడతగా రూ.260 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిధులు మంజూరు కావడం కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమని కిషన్‌రెడ్డి తెలిపారు. మిగిలిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందగానే దశల వారీగా మరో రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పీఎఫ్‌ఎంఎస్ విధానం తప్పనిసరి..!

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ ఈ నిధుల వినియోగానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) పోర్టల్‌లో నమోదు చేసి ప్రత్యేక గుర్తింపు కోడ్ పొందాలని కేంద్రమంత్రి సూచించారు. ఈ విధానం ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందుకే స్థానిక సంస్థలకు నిధులను ఎప్పటికప్పుడు సమయానుగుణంగా విడుదల చేస్తోందని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీల ఖాతాల్లోని నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ కారణంగా అప్పటి సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు రాజీనామాలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడటం కూడా అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇకనైనా చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు అందిస్తుందని, వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.