epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలి
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు
తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల్లో ప్ర‌చారం

కాకతీయ, తిరుమలగిరి/మోత్కూర్ : ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రజలు వేసే ఓట్లతో అవినీతి బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలపై ఈసారి కాంగ్రెస్ జెండానే ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాల్లో ఎంపీ చామల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి బొజ్జు సంధ్య రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ, అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేస్తే రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో సాగుతున్న ప్రజాపాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. టిక్కెట్లు దక్కని నాయకులు అసంతృప్తికి లోనుకాకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆయన కోరారు. టిక్కెట్ రాని నాయకులకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించడంతో పాటు పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసి, తిరుమలగిరి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఎంపీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, కష్టపడ్డ వారికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి వర్షాభావంతో ఎండుతున్న...

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన...

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా? సాగర్‌ నీటిపై జిల్లా మంత్రులు...

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు...

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి కాకతీయ, భువనగిరి : భువనగిరి...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత కాకతీయ, తుంగతుర్తి: తాను చిన్ననాడు ఓనమాలు నేర్చిన...

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య తుంగతుర్తిలో...

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేత హైదరాబాదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.