epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నర్సంపేటలో హస్తం హవా

నర్సంపేటలో హస్తం హవా
స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీ కైవసం
మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిపత్యం
ఛైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి ఖరారు

కాకతీయ, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 21 వార్డుల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 6 వార్డుల్లో గెలవగా, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 1 వార్డులో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం సాధించింది.

నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

ఛైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి ఖరారు

వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన కౌంటింగ్ మూడు దశల్లో ముగిసింది. మొదటి రౌండ్‌లోనే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌లో మరో 5 స్థానాలు, మూడో రౌండ్‌లో 6 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని నమోదు చేసింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి రామానంద్ పేరును ఎన్నికల ప్రచారంలోనే ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆమె చైర్పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఖాయమైంది. ఇక వైస్ చైర్మన్ పదవికి అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొంది.

బీజేపీ, సీపీఎం బోణి

మున్సిపాలిటీలో బీజేపీ, సీపీఎం పార్టీలు కూడా ఖాతా తెరిచాయి. బీజేపీ తరఫున 28వ వార్డు నుంచి జూలూరు రోజారాణి విజయం సాధించారు. సీపీఎం మద్దతుతో 10వ వార్డు నుంచి హన్మకొండ శ్రీధర్ గెలుపొందడం విశేషంగా నిలిచింది. అలాగే 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి దొంగల రజిత విజయం సాధించారు. నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తన ఆధిపత్యాన్ని మరొకసారి నిరూపించుకుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.