epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జ‌న‌గామ‌లో హంగ్‌..!

జ‌న‌గామ‌లో హంగ్‌..!
జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం
30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 11 స్థానాలు
ఇండిపెండెంట్లు – 3, సీపీఎం – 1, బీఆర్ఎస్ రెబల్ – 1
చైర్‌పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ

కాక‌తీయ‌, జ‌న‌గామ : జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 30 వార్డుల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 13 వార్డుల్లో విజయం సాధించి ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి, ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్‌పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొదటి వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సజ్జ దుర్గాప్రసాద్ గెలుపొందగా, రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామగల విజయ్ విజయం సాధించారు. మూడో వార్డులో సీపీఎం అభ్యర్థి బూడిద జ్యోతి గెలుపొందారు. నాలుగో, ఆరవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంత్రి సుమలత, బుక్క భరద్వాజ్ గెలిచారు. ఐదో వార్డులో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మిద్దెపాక భాస్కర్ విజయం సాధించారు. ఏడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సాజిద్ కమర్, ఎనిమిదో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి సందుపట్ల మంజుల గెలిచారు.

బీఆర్ఎస్ ముందంజ – కాంగ్రెస్ గట్టి పోటీ

తొమ్మిదో, పదకొండో, పదమూడో, పదిహేడో, పద్దెనిమిదో, ఇరవయ్యో, ఇరవై ఒకటో, ఇరవై నాలుగో, ఇరవై ఆరవ, ఇరవై ఎనిమిదో, ఇరవై తొమ్మిదో వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పదో, పన్నెండో, పద్నాలుగో, పదహారో, పంతొమ్మిదో, ఇరవై రెండో, ఇరవై ఐదో, ఇరవై ఏడో, ముప్పైవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎనిమిదో, పదిహేనో, ఇరవై మూడో వార్డుల్లో విజయం సాధించి కీలక స్థానాల్లో నిలిచారు. సీపీఎం అభ్యర్థి మూడో వార్డులో గెలుపొందడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం ఫలితాల్లో బీఆర్ఎస్ – 13, కాంగ్రెస్ – 11, ఇండిపెండెంట్లు – 3, సీపీఎం – 1, బీఆర్ఎస్ రెబల్ – 1 స్థానాలు దక్కించుకున్నాయి. మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, ఏ పార్టీకి అది రాకపోవడంతో ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు కీలకంగా మారింది.మొత్తం వార్డులు: 30 కాగా, మ్యాజిక్ ఫిగర్ : 16 ప్రస్తుత పరిస్థితి: హంగ్ – ఇండిపెండెంట్లు కీలకం. చైర్‌పర్సన్ ఎన్నికలో ఎవరి వైపు ఇండిపెండెంట్లు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇరుపార్టీలు ఇప్పటికే మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో జనగామ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠగా మారాయి.

పార్టీ వారీగా స్థానాల వివరాలు

బీఆర్ఎస్ – 13

కాంగ్రెస్ – 11

ఇండిపెండెంట్లు – 3

సీపీఎం – 1

బీఆర్ఎస్ రెబల్ – 1

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.