epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేపటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు

రేపటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు
అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలి
ప్రజల్లో ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి
వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర

కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర ఆదేశించారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో వారం రోజులపాటు ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

వారోత్సవాల షెడ్యూల్ ఖరారు

ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ దినంగా నిర్వహించి ఆహార భద్రత, కల్తీ ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదే రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు “ఈట్ రైట్ వాక్” నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించగా, 8న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించారు. 9న ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్ వాక్” నిర్వహించాలన్నారు. 10న హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా యోగా డెమో క్యాంప్ నిర్వహించగా, 11న డ్రగ్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మందుల వినియోగం, డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యం కీలకం

వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలకు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను డీఎంహెచ్ఓ వివరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎస్పీ, డీపీఓ వెంకయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.