పారిశుధ్య కార్మికులకు పాదపూజ
సమాజాన్ని రోగాల నుంచి కాపాడే నిజమైన దేవుళ్లు
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు
కాకతీయ, ఖమ్మం : పారిశుద్ధ కార్మికులు సమాజాన్ని రోగాల నుంచి కాపాడే నిజమైన దేవుళ్లని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు అన్నారు. వారి సేవలకు గౌరవంగా పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ కార్మికుల పాదాలను కడిగి సన్మానించి, నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం శుభ్రతను కాపాడే నిజమైన హీరోలు పారిశుద్ధ కార్మికులేనని పేర్కొన్నారు. ప్రజలు రోగాల నుంచి రక్షణ పొందేందుకు వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. శుభ్రత ఉద్యమ స్ఫూర్తితో ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కుంభమేళా సందర్భంగా ప్రధాని మోదీ పారిశుద్ధ కార్మికులకు గౌరవం తెలిపిన సంఘటనను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుద్ర ప్రదీప్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్త వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

