రేవంత్ కాలి గోటికి సరిపోడు జీవన్ రెడ్డి
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం
42 సంవత్సరాలు కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని అక్రమాలు
ఇప్పుడు కేసీఆర్ వద్ద మోకరిల్లిండు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, జీవన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, జీవన్ రెడ్డిలు.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పై దగాకోరు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోవడన్నారు. జీవన్ రెడ్డి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం అని.. 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. ఇప్పుడు కేసీఆర్ కాళ్ళ దగ్గర మోకరిల్లిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో రాజకీయ జీవితం గడిపి కాంగ్రెస్ను విమర్షించడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు.
రేవంత్రెడ్డి ఆస్తులు త్యాగం చేసిండు
రెడ్డి జీవిత చరిత్ర మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమం గురించి జీవన్ రెడ్డికి ఏం తెలుసు? కాంగ్రెస్ లో 14సార్లు పోటీ చేసిండు.. ఇంకా జీవన్ రెడ్డి కి ఏమి కావాలి? జగిత్యాలలో రాజకీయంగా ఒక్క కార్యకర్తను ఎదగనీయలేదు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని తరిమేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సూచనల మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు త్యాగం చేసిండు. పదవి కోసం, పార్టీని బలోపేతం చేసుకునేందుకే కేసీఆర్ పార్టీ పెట్టుకుండు. ఉద్యమకారుడివి అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 11 సీట్లు ఎలా గెలిచావు? సెంటి మెంట్ ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కేంద్ర మంత్రి అయిండు. రాష్ట్ర మంత్రులను చేయలేదా? కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని అందరికి తెలుసు అని కాంతం విమర్శించారు.

