రేవంత్‌రెడ్డి కార్మిక పక్షపాతి
ప్రజా ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం
అధికారంలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులని గెలిపిస్తేనే అభివృద్ధి
టీజేఈయూ అధ్యక్షులు మొగుళ్ళు రాజి రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని.. ప్రజా ప్రభుత్వంలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీజేఈయూ అధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి అన్నారు.
సాహెబ్ నగర్ రిజర్వాయర్ ప్రాంగణంలో టీజేఈయూ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి టీజేఈయూ, ఏఐటీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మొగుళ్ల రాజురెడ్డి పాల్గొన్నారు. ముందుగా కార్యాలయ ఆవరణ లో గల విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మొగుళ్ళ రాజిరెడ్డిని పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు శాలువాలతో సన్మానించారు. యూనియన్ సెక్రటరీ రాఘవేందర్ మాట్లాడుతూ… అధికారంలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులని గెలిపిస్తే మన యూనియన్ సమస్యలు పరిష్కరించే దిశలో ఉంటారని.. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతిగా ఉన్నారని.. అందుకోసం నాయకులు మొగుళ్ళ రాజిరెడ్డిని అధ్యక్షులుగా గెలిపించుకోవాలని కోరారు. అధ్యక్షులు మొగుళ్ళు రాజు రెడ్డి మాట్లాడుతూ.. తాను పదవిలో ఉన్నా.. లేకున్నా కార్మికులకు పక్షాన ఎప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. వారికి కావలసిన పనులు సకాలంలో చేసి పెడతానని ఈ సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మన కార్మికులకు ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తానని.. రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత కళ్లెం రాజిరెడ్డి, రాఘవేందర్ రాజు, చంద్రశేఖర్, సతీష్, శ్రవణ్ కుమార్, జహంగీర్, జయరాజ్, రాజు, ఆనందరెడ్డి, యాదయ్య గుప్తా పాల్గొన్నారు.

