epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం
కొత్త పార్టీని ప్ర‌క‌టించిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌
తెలంగాణ ఆత్మ కోల్పోయినందుకే బీఆర్ఎస్‌కు దూరం
మూడు కోట్ల మందికి అమ్మలా సేవ చేయడమే లక్ష్యం
సామాజిక న్యాయం కోసం మలి రాజకీయ ప్రస్థానం
టీఆర్‌ఎస్ ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు చేరుస్తాం
గత పాపాల్లో నాకూ భాగముంది.. క్షమించండి
కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పింది
ఆ కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా
పార్టీ ఆవిర్భావ ప్ర‌సంగంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై శనివారం పెను సంచలనం నమోదైంది. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సొంత కుటుంబాన్ని మరియు గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పశ్చాత్తాపం మరియు ఆగ్రహం మిళితమై సాగింది. ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోయిందని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

దారి తప్పిన రథంపై కవిత పశ్చాత్తాపం

పార్టీ ఆవిర్భావం స‌భ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ మనం ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం కలలు కన్న రాష్ట్రం రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పిందని అన్నారు. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందని వ్యాఖ్యానించారు. ఆనాడు పరిపాలించిన ఆ కుటుంబంలో తాను ఒక భాగమైనందుకు ఈరోజు సిగ్గుపడుతున్నానని క‌విత కుండబద్దలు కొట్టారు. గత పాలనలో ఇసుక దందాల మీద ప్రేమతో దళితుల ప్రాణాలు పోయాయని మరియు దారుణమైన నిఘా నీడలో ఫోన్ మాట్లాడాలన్నా భయం వేసే పరిస్థితి నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు. తన తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆ తప్పులను దిద్దుకోవడానికే ఈ సేనగా ప్రజల ముందుకు వస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాగృతి కాగడ నుంచి రాజకీయ శక్తి వరకు

తెలంగాణ జాగృతి ద్వారా ఇరవై ఏళ్లుగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ఉద్యమంలో ఆడబిడ్డలను భాగస్వాములను చేసిన ప్రస్థానాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాగృతి అనేది ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యిందని కానీ బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోయిందని దుయ్యబట్టారు. అందుకే రాజకీయ శక్తి ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమని నమ్మి ఈ పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు. తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలా పరిణతి చెంది ఆర్తితో కూడిన పాలన అందించడమే తన ప్రధాన అజెండా అని కవిత ప్రకటించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా సామాజిక తెలంగాణను నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

సామాజిక స్ఫూర్తితో ప్రజా పోరాటం

చాకలి ఐలమ్మ మరియు గద్దరన్న అలాగే మారోజు వీరన్నల పోరాట స్ఫూర్తితో సమ్మక్క సారక్కల సామాజిక స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్ర సేన ముందుకు వెళ్తుందని కవిత ప్రకటించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ మరియు పాపన్న గౌడ్ అలాగే పంతు నాయక్ వంటి మహనీయుల ఆశయాల సాక్షిగా సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఆమె అభివర్ణించారు. రాజకీయ శక్తితో ప్రజా పోరాటాలను మిళితం చేసి కొత్త చరిత్రను రచిస్తామని పిలుపునిచ్చారు. సొంత తండ్రిపైనే కవిత తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.