epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కలం కార్మికులే సమాజానికి దిక్సూచి

కలం కార్మికులే సమాజానికి దిక్సూచి
పనిగంటలకు అతీతంగా జర్నలిస్టుల సేవలు
అమరవీరులకు, మధుసూదన్‌కు ఘన నివాళి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్

కాకతీయ, మయూరి సెంటర్. : సమాజానికి కళ్లు, చెవుల్లా నిలిచే జర్నలిస్టులు పనిగంటలకు అతీతంగా ప్రజాహితం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ కొనియాడారు. మే డే సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ అధ్యక్షతన జర్నలిస్టుల ‘మే డే’ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత జర్నలిస్టు అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. సాధారణ కార్మికులకు ఎనిమిది గంటల పని పరిమితి ఉంటుంది.. కానీ జర్నలిస్టులకు అర్ధరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేదు. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండాల్సిన బాధ్యత జర్నలిజం వృత్తిది. ఇది కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక నిరంతర సామాజిక యజ్ఞం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో, నిజాలను వెలుగులోకి తేవడంలో కలం కార్మికుల పాత్ర అమోఘం.

సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి

సమాజం కోసం ఇంతగా శ్రమిస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలు, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జాప్యం, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మరియు పెన్షన్ వంటి కీలక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. జర్నలిస్టుల ఐక్యతే వారి బలమని, హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి. కలం శక్తి ఒకటైతే సమాజాన్ని మార్చవచ్చు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్ఓ మధుసూదన్ అకాల మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని రాజశేఖర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మధుశ్రీ, అర్షద్, జిల్లా నాయకులు షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, ఫయాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.