epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పంట‌ను ఎందుకు కొనరు

పంట‌ను ఎందుకు కొనరు
నెల రోజులైనా కొనుగోళ్లు చేపట్టడం లేదు
గన్ని బ్యాగుల సరఫరాలో ఎడ‌తెగ‌ని జాప్యం
ములుగు జిల్లాలో మొక్క‌జొన్న‌ రైతుల నిర‌స‌న‌
మ‌ల్లంప‌ల్లిలో జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకో
2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
అదనపు కలెక్టర్ హామీతో విరమించిన అన్నదాతలు

కాకతీయ, ములుగు ప్రతినిధి: మక్కల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మల్లంపల్లిలో రైతులు శనివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పంట కోత పూర్తై నెల రోజులు గడిచినా కొనుగోళ్లు చేపట్టకపోవడం, గన్ని బ్యాగుల సరఫరాలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచే రైతులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లంపల్లి మండలంలోని రామచంద్రపురం వద్ద ప్రధాన కేంద్రం, పరిసర గ్రామాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోతే తీవ్రంగా నష్టపోతామని, నాణ్యత దెబ్బతింటే మద్దతు ధర రాదని వాపోయారు. ఇదే అదనుగా మధ్యవర్తులు తక్కువ ధరకే పంటను అడిగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఉపేందర్ రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది.

రెండు రోజుల్లో కొనుగోళ్లు..
ముగింపుగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో గన్ని బ్యాగులు, వాహనాలు అందుబాటులోకి తెచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన గట్టి హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. అనంతరం రైతు నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద నాయక్, మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజు యాదవ్, గుండెబోయిన చంద్రయ్య, గోల్కొండ రాజు, బైకానీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.