epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
చర్ల మండలంలో కలెక్టర్ అంకిత్ విస్తృత పర్యటన

కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పాటు చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం పరిమాణం, రవాణా పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ.. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ సదుపాయంతో పాటు తార్పాలిన్లు, హమాలీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి

అనంతరం సత్యనారాయణపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. కాకర్లపూడి విజయలక్ష్మి పూర్తి చేసిన ఇల్లు, చినిగిరి రాజు రూఫ్ స్థాయిలో ఉన్న ఇల్లు, కారం నాగరాజు స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పునాది నుంచి స్లాబ్ వరకు ప్రతి దశలోనూ ఇంజనీరింగ్ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, సిమెంట్, ఇనుము వంటి సామగ్రి నాణ్యంగా ఉండేలా చూస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామంలో మంజూరైన 27 ఇళ్లలో ప్రస్తుతం 25 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన 2 ఇళ్లకు కూడా వెంటనే పనులు ప్రారంభించాలని (గ్రౌండింగ్) ఆదేశించారు. పేదలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రి తనిఖీ.. రోగులతో సంభాషణ..!

చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్.. ఓపీ విభాగం, మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంట గదిని తనిఖీ చేశారు. ఓపీ విభాగంలో ఉన్న రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు అందించే ఉచిత మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన ఔషధాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్‌ను అప్‌డేట్ చేయాలని సూచించారు. రోగులకు పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. ఆసుపత్రిలో తాగునీటి కొరత ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్.. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే నిరంతర నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ ముకేశ్, ఏఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈలు అరుణ్, రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సాయి వర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.