బానోత్ మదన్ లాల్‌కు నివాళి
కాకతీయ, ఏన్కూర్: వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏన్కూర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైరా బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు పాల్గొని మదన్ లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మదన్ లాల్ సతీమణి, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో గిరిబాబు మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గ అభివృద్ధికి మదన్ లాల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గద్దగిరి సత్యనారాయణ, భూక్యా ధర్మ నాయక్, దుంపల వినోద్, కడియాల సుధాకర్ తదితర ఏన్కూర్ మండల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

