epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో నేరాలు పెరిగాయి..

రాష్ట్రంలో నేరాలు పెరిగాయి..
శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయి
ముఖ్యమంత్రి, బండి సంజయ్ మధ్య ‘చీకటి ఒప్పందాలు’
డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కౌశిక్ రెడ్డిపై దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌దే బాధ్య‌త‌
బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఆరోప‌ణ‌లు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న అరాచక పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం మండిపడింది. కరీంనగర్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం, కార్యాలయంపై జరిగిన దాడులపై శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నచ్చని రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో పోలీసుల వైఫల్యాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని, నిన్నటి ఘటనలో కౌశిక్ రెడ్డిని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, కాబట్టి ఆయనపై కేసు నమోదు చేసి ఏ-1గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వెంటనే భద్రత పెంచాలని కోరారు.

ముఖ్యమంత్రికి బండి సంజయ్ ‘సహాయ’ మంత్రి: వివేకానంద
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య చీకటి ఒప్పందాలు, వ్యాపారాలు ఉన్నాయని బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఆపద వచ్చినా బండి సంజయ్ ‘సహాయ మంత్రి’లా ఆదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. “కేటీఆర్‌ను డ్రగ్స్ అని విమర్శిస్తే మేము అదే భాషలో సమాధానం చెబుతాం. మా ప్రభుత్వం వచ్చాక బండి సంజయ్ గుజరాత్ వెళ్లి దాచుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన హోంశాఖ సహాయ మంత్రి గుండాలను పెట్టి దాడులు చేయించడం దారుణమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులే గుండాలను బతిమిలాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని, బిహార్ సంస్కృతిని తెలంగాణకు తీసుకురావద్దని డీజీపీని కోరామన్నారు. దాడులు ఇలాగే కొనసాగితే ఆత్మరక్షణ కోసం తాము కూడా ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ పుట్టుకపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హోంశాఖ సహాయ మంత్రి వాడే భాషలా ఉందా? అని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు శాఖ ఎవరి కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురవ్వడం, మహిళా సీపీ సుమతిపైనే పోకిరీలు అల్లరి చేష్టలకు పాల్పడటం చూస్తుంటే భద్రత ఎక్కడుందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ కార్యాలయాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్ తదితరులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.