epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మైనారిటీ విద్యార్థులకు ‘నైపుణ్య’ డిగ్రీ కళాశాలలు

మైనారిటీ విద్యార్థులకు ‘నైపుణ్య’ డిగ్రీ కళాశాలలు
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏఐ, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు
మూసీ తీరంలో సర్వమత సంస్కృతులకు నెలవుగా కట్టడాలు
ఆటో డ్రైవర్ల కోసం ఎలక్ట్రిక్ రీట్రోఫిట్టింగ్ ప్రణాళిక
ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మైనారిటీ సంక్షేమ శాఖపై అధికారుల‌తో సీఎం స‌మీక్షా
పలు కీలక నిర్ణయాలకు ప్ర‌తిపాద‌న‌లు..త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులతో కూడిన ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు కేవలం సంప్రదాయ కోర్సులు మాత్రమే కాకుండా, వారి జీవనోపాధికి తక్షణమే ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే బోధనలో ఏఐ సాంకేతికతను జోడించాలని సూచించారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందజేస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలన్నారు. గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు ఆ శాఖ పరిధిలోని కార్యక్రమాలపై అవగాహన కల్పించి బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

ఆటో డ్రైవర్లకు అండ.. ఇమామ్‌లకు భరోసా
ఆటో డ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లుగా మార్చే (రీట్రోఫిట్టింగ్) ప్రక్రియను చేపట్టడం ద్వారా ఇంధన ఖర్చులు లేకుండా చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే మతపరమైన సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను ఎలాంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ లభ్యత ఉన్న చోట ముస్లింల కోసం ఖబరస్తాన్‌లకు అవసరమైన స్థలాలను కేటాయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విద్యా, క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేలా గ్రూప్స్ అభ్యర్థులను, క్రీడాకారులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మూసీ తీరంలో గంగా జమునా తెహ్‌జీబ్
హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో తెలంగాణ విశిష్ట సంస్కృతి ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మూసీ అభివృద్ధిలో కేవలం గుడి మాత్రమే కాకుండా మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను మరియు తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్‌ను చాటిచెప్పేలా ఆ కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. ఇవి కేవలం ప్రార్థనా స్థలాలుగానే కాకుండా మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప కేంద్రాలుగా పరిఢవిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబాని, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.