epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు

పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించం
17 నామినేషన్లలో ఎంపికైన వారే అధికారిక అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామనాథం

కాకతీయ,పినపాక: కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షుడు రామనాథం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలపై ప్రచారంలోకి వచ్చిన వార్తలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించిందని తెలిపారు. ఆ విషయాలపై సమగ్ర విచారణ అనంతరం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఎవరైనా ప్రజలను, అధికారులను, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేస్తే అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ, క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఉన్నాయని, వాటికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతమంది వ్యక్తులు తమను తాము మండల అధ్యక్షులుగా ప్రచారం చేసుకోవడం, పత్రికల్లో వార్తలు రాయించుకోవడం జరుగుతోందని, ఇది పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన 17 నామినేషన్లలో ఎంపికైన వారే మండల అధ్యక్షులుగా గుర్తింపు పొందారని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయించిన నాయకత్వాన్ని ప్రతి కార్యకర్త గౌరవించాలని సూచించారు. గతంలో పార్టీ కార్యాలయానికి తాళం వేసిన వారే పార్టీకి మొత్తం మేమే అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ క్రమశిక్షణతో పనిచేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీను వాసరావు, భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, ఉప్పాక సర్పంచ్ బాబురావు, ఉప్పాక ఉపసర్పంచ్ కోడెం రామ్ మోహన్ రావు, సంపత్, మార్తా మనోజ్, నక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.