9వ రోజుకు చేరిన ఐకెపి వీవోఏల రిలే నిరాహార దీక్షలు…
కాకతీయ,పినపాక: పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఐకెపి వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీవోఏలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా పినపాక ఈ-బయ్యారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ లు, ఫీల్డ్ ఆఫీసర్ లు సమ్మె శిబిరాన్ని సందర్శించి వీవోఏలకు సంఘీభావం తెలిపారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సమ్మెలో పాల్గొంటున్న వీవోఏలకు కూల్ డ్రింక్స్, జ్యూస్ పంపిణీ చేసి మద్దతు ప్రకటించారు.తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీవోఏలు స్పష్టం చేశారు.

