దుమ్ముగూడెంలో తెలంగాణ అవతరణ వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కాకతీయ దుమ్ముగూడెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్లం హరికృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సత్యాలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలక వెంకట రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి లంక అబ్బులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరభద్రం, మాజీ మండల అధ్యక్షుడు వినిల్, సాంఘిక మాధ్యమాల (సోషల్ మీడియా) జిల్లా చైర్మన్ దేవా, సర్పంచులు ఆదినారాయణ, సుబ్బారావు, నాయకులు శివాజీ, శ్రీనివాసరావు, సాంబశివరావు, అప్పలరెడ్డి, శేఖర్, బాలాజీ, సూర్యచంద్రరావు, సుధాకర్, మండల యువజన విభాగం (యూత్) అధ్యక్షుడు ప్రవీణ్, రమేష్, శ్రీకాంత్, అర్జున్‌రావు పాల్గొన్నారు.

