epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల సొమ్ము ప్రచార ఆర్భాటాలకేనా..?

కార్మికుల సొమ్ము ప్రచార ఆర్భాటాలకేనా..?
వెల్ఫేర్ ఫండ్ పేరుతో కోతలు.. ఆ సొమ్ము ఎక్కడ ఖర్చవుతోంది..?
ఆవిర్భావ వేడుకల్లో ఖాళీ కుర్చీలే దర్శనం… కార్మికుల ఆనందాలు ఎక్కడ..?
గత మూడేళ్లుగా ఒకే కమెడియన్‌కు ప్రాధాన్యం ఎందుకు..?
మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ తీవ్ర విమర్శలు

కాకతీయ, మణుగూరు : మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను అధికారులు తమ సొంత ప్రచార ఆర్భాటాలకే వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేడుకల నిర్వహణపై మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆమె, పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చి వేడుకలు ఘనంగా జరిపినట్లు అధికారులు కలరింగ్ ఇచ్చారే తప్ప క్షేత్రస్థాయిలో కార్మికుల భాగస్వామ్యం ఎక్కడా కనిపించలేదన్నారు. “రాజుల సొమ్ము రత్నాల పాలు అన్నట్లు.. కార్మికుల కష్టార్జితాన్ని అధికారులు తమ సొంత పబ్లిసిటీకి వాడుకోవడం ఎంతవరకు సమంజసం?” అని ఆమె నిలదీశారు.

ఫొటోలకే పరిమితం.. ఖాళీ కుర్చీల ప్రదర్శన..!
సింగరేణిలోని ఇతర ఏరియాల్లో తెలంగాణ జ్వాల వెలిగించి, రన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తే.. మణుగూరులో మాత్రం అలాంటివేమీ జరపకుండానే దొంగ ఫొటోలు తీసి ప్రచారానికి వాడుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. కార్యక్రమ ప్రాంగణంలో కార్మికులు లేక ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయని, కార్మికుల్లో ఎక్కడా ఆనందం కనిపించలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి స్టేడియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు గత మూడేళ్లుగా ఒకే జబర్దస్త్ కమెడియన్ లేదా యాంకర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటని దుర్గ ప్రశ్నించారు. ఈ ఆవిర్భావ వేడుకలు అధికారుల వ్యక్తిగత అభిరుచుల కోసమా, లేక కార్మికుల కోసమా అని మండిపడ్డారు. కవరేజ్‌కు వచ్చిన పాత్రికేయులకు కనీస గ్యాలరీ, సౌకర్యాలు కల్పించకుండా అవమానకరంగా వ్యవహరించడంపై మీడియా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిధుల వినియోగంపై అనుమానాలు.. డీసీఎంకు ఫిర్యాదు!
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రూ.3.20 లక్షలతో పాటు కార్మికుల జీతాల నుంచి వెల్ఫేర్ ఫండ్ పేరుతో ప్రతి నెల లక్షల రూపాయలు కోత విధిస్తున్నారని, ఆ నిధులు నిజంగా కార్మికుల సంక్షేమానికే వినియోగిస్తున్నారా? లేక ఇలాంటి వృథా ఖర్చులకు మళ్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కొందరి వ్యక్తిగత ప్రచార వేదికగా మార్చడం సరికాదని, ప్రతి ఖర్చు వివరాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మణుగూరు సింగరేణి ఏరియాలో జరుగుతున్న ఈ నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై త్వరలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సింగరేణి సీఎండీ, డైరెక్టర్ పా, పర్సనల్ వెల్ఫేర్ జీఎంలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు పాల్వంచ దుర్గ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.